Saturday, November 2, 2013

దీపావళి శుభాకాంక్షలు

దీపాల వెలుగులో, దివిసీమ నీడలో,
ఆహ్లదపు అరుగులో, ఆనందపు తొటలో,
ఆత్మీయుల సమూహంలో, ఆటల పాటలతో,
లక్ష్మి పూజలతో, బంతిపూల మాలలతో,
రుచికర వంటలతో, విరజిమ్మె టపాసులతో,
మీ జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ,

దీపావళి శుభాకాంక్షలు


Thursday, August 8, 2013

బ్రతుకే ఒక అబద్ధం

బ్రతుకే ఒక అబద్ధం, అది నమ్మక తప్పని నిజం..

బాల్యంలో అమ్మ దగ్గర, బడి లోన గురువు దగ్గర

ప్రతి ఆటలో గెలుపు దగ్గరా.... | |బ్రతుకే| |

చదువు కాడ , ప్రతి మలుపు కాడ ,

ప్రతి గడియకు ,విగడియకు , అనుక్షణమ్ .... | |బ్రతుకే| |

యవ్వనాన ప్రేమలో , కనపడని మాయలో,

ఓడినాక దానిలో , మనసు దాచే క్రమములో | |బ్రతుకే| |

ఉద్యోగ అవకాశం , అది సాధించే రూటులో ,

ఆర్జించే ప్రతి పైసా ఖర్చు చేయు సమయంలో | |బ్రతుకే| |

పడక పైన భార్య దగ్గర , పనికాడ బాస్ దగ్గర ,

కలిసే ప్రతి వాని దగ్గర , కాటి కెళ్ళే దారి పొడుగునా .... | |బ్రతుకే| |