Sunday, March 21, 2010


ఆదరించు హృదయం ,
అందించుటకు సాయం
ఆకలితో ఉన్నవాడి కడుపు నింపుటకు
కష్టాల వలయాలు పోగొట్టి
కరుణా ,చేయూత ఇవ్వుటకు
మేమున్నాం మేమున్నాం అంటూ
ఏర్పడింది V2HelpU.


Monday, March 15, 2010

ఉగాది

తెలుగు వసంతం ,కోయిల రాగం పాడగా
తేజస్సును ప్రసరిస్తూ భానుడు భగ భగ మండిపోగా
విద్యార్థి లోకం ఉన్నత చదువుల ఉత్తిర్నతకు ఉరకలేయగా
జీవితంలో షడ్రుచులను చేతిలోకి తెచ్చి
నవరసాలను చూపించే నాగరికత నగరంలో
తెలుగు ఉనికిని చాటుతూ
నలుదిక్కులా పంచాంగ శ్రవణం చదువుతూ
సంతోషాల సంవత్సరానికి సరికొత్త యుగానికి ఆది మన ఉగాది

ఉగాది శుభాకాంక్షలు

తెలుగు నుడి కారపు ,తియధనాన్ని ,
వగరు ,పులుపు కాకుండా ,
ఉప్పు నీటిలో కలవకుండా ,
జీవితంలో చేదు జ్ఞాపకాలను వదలి
కొత్త ఆశలతో ,
సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తు ,
కొత్త యుగానికి ఆరంబ గీతం
పాడేది మన ఉగాది .

Sunday, March 7, 2010

మహిళాదినోత్సవ శుభాకాంక్షలు


మహి పైన మహిమ కలిగి ,
మనసును మనిషిగా చేసి ,
మాతృమూర్తిలా మారి ,
మా అందరికీ ప్రాణం పోసి,
అనురాగానికి ఆయువు ఐయి,
ఆడుకునే స్నేహితురాలివై ,
లోకానికి నీవె ఆధారమై ,
అనురాగానికి మారుపేరుగా ,
ఆవేశంలో ఆధిపరాశక్తిల,
అడుగడుగున ఆసరాగా ,
నీవె ఒక లోకంగా మారి ,
ప్రపంచాన్ని నీలో దాచుకున్న,
ఓ "మహి'ళా నీకు అభివంధనం.