Saturday, June 18, 2011

నా పుట్టిన రోజు !!!!



మొదటి
గడియలు మూడు మనసుల గ్రీటింగ్స్,
వేకువ జామున చేసాను గుడిచుట్టు రౌండ్స్ ,
మా వెంకు చూస్తుందని దాచేస చాక్లెట్స్ ,
అందరికి ఇవ్వటానికి తీసుకున్న స్వీట్స్ ,
మధ్యలో లిఫ్ట్ చేశా ఇంకంమింగ్ కాల్స్ ,
ఫ్రెండ్స్ తో కానిచ్చ ఈవెనింగ్ చాట్స్,
రోజులో కట్ చేశా ముచ్చటగా త్రీ కేక్స్ ,
ప్రతి గడియ పెంచింది రోజులో హై లైట్స్ .
మొదటి గడియలు మూడు మనసులా ముచ్చట్లు,
వేకువ జాము గడియలు

Friday, June 17, 2011

కవిత...

మనసులోని భావాలకు అక్షర మాలిక ,
సౌందర్య విశ్లేషణ నీతోనే తేలిక ....

మొదలెట్టా నీతో ప్రయాణం , ఒక కల్పనగా ,
దాచేసా మిమ్మల్ని బ్లాగులో భద్రంగా ....

మనసుతో చూసాను ప్రకృతిలో ప్రతి అందాన్ని ,
పరవశించి రాసాను దానిలోని భావాన్ని ....

కన్నులతో చూసాను కల్తి సమాజాన్ని,
కలంతో తెలిపాను అక్షర సత్యాన్ని ....

కోయిలమ్మ ...................

రాగల పల్లకిలో కోయిలమ్మ ...
కుహు కుహు అంటుంది పాటలమ్మ...

రూపేమో నలుపు ,
మనసు మనతో కలుపు,
పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ,
తన పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ....

ఆకాశాన విహారి ,
చెట్టే తన జాగిరి ,
కుహు కుహు అంటూనే ,కూనిరాగాలు తీస్తుంది ...

కవుల పాటకు ప్రతిమ ,
స్వరసంపదే తన విలువ ,
కలిసి పాడమంటూ సవాలే విసిరింది .
తనతో, కలిసి పాడమంటూ సవాలే విసిరింది,

Wednesday, June 15, 2011

అర్ధం కాని పుస్తకం

అర్ధం కాని పుస్తకం , నా జీవితం.
విషయ సూచిక అసలే లేని ప్రయాణం .
ప్రతి పాటం నేర్పింది ఒక గుణపాటం.
పేజి పేజి తెచ్చింది నాలో మార్పు అనుక్షణం .
పేజి తిప్పితే ఏముంటుందో అన్న భయం ,
ఉన్న పెకిలో ఉండనివ్వని జీవన చక్రం.
బాష ,యాస అక్కరలేని జీవిత గ్రంధం ,
తెరచి చూస్తే కనిపించే ప్రతివాడి గతం .
మొదటి అడుగులో అచ్చులు నేర్చి ,హావ భావాల హల్లులతో ,
సాగించా నే ప్రయాణం, కొనసాగించా నా జీవనయానం.

Tuesday, June 14, 2011

బడిపిల్లలు

ఒడి ఒడిగా అడుగులు వేసే , బడివైపు పరుగులు తీసే ,
గడ్డిమోపు బరువే వున్న భ్యాగులనే భుజాన వేసే ,

హలిడేసు హారతిల ఆవిరి ఐతే ,
ఏడుపుతో కొందరు, ఎదుగుధలకై కొందరు ,
భవితనే బంగారం చేయ నిశ్చయించి ....
........|| ఒడి ఒడిగా ||
బడిలోన పంతులే ,పాటలు చెప్పితే ,
పైన కింద పడుతూనే , చెప్పింది రాసుకుని ,
చదువాలని కొందరు , చదువలేని ఎందరో ..
.........||ఒడి ఒడిగా ||
సర్కారు చదువులు, ఎడారిలో ఎండమావులు
కనిపించని పుస్తకాలు , కనిపించే పురుగులు ,
అడుగడుగున అవస్థలు , తలకెక్కని అమాత్యులు ..
ఐనా సరే అంటూ || ఒడి ఒడిగా||

Thursday, June 9, 2011

చెప్పాలని అనుకున్నా చిన్ననాటి నేస్తమా ,
నీ అడుగులని అనుసరించనా విడలేని బంధమా ,
గుప్పెడంత గుండెలోనా ఉప్పెనల్లె ప్రేమ దాచ
చెప్పలేక నిలుచున్న , చెప్పాలని అనుకున్నా,
అమావాస్య చంధమామలాగా కనపడని నా ప్రేమ ,
శూన్యంలో మాటలాగా వినపడదు నా గాథ ,
ప్రేమనంత మూటగట్టి మనసులోనే దాచాను
మౌనమే నా స్నేహం అంటూ మాటలాడుతున్నాను.

Wednesday, June 8, 2011

స్మశానం

అందరు వున్న , అనాధవైన అక్కున చేర్చేది ,
తనువును తనలో దాచి , ఆత్మని వదిలేది ,
మరణించిన వారి అంతిమ గమ్యం ,
విరోధం అసలే కనపడని విశ్రాంతి నిలయం ,
కుల, మత , గోత్రం అడ్డురాని దేవాలయం ,
ఆదమరచి నిదురించే ఆశ్రయం,
ఎన్నికల గొడవ అసలే లేని ఎముకల గుడారం ,
ఆస్తి తగాదాలు కానరాని అస్తికల నిలయం ,
అందం ,చందం , ఆభరణం అక్కరలేని అస్థిపంజరం
అడుగడుగున కనపడుతూ సృష్టించే మనలో భయం.


మేఘం!!!

ఉరిమి ఉరిమి వాన తానై ఉరకలేసే మేఘం
మబ్బు తానై మండుటెండలో గొడుగు తానై మేఘం ,
వాన నీటిని తనలో దాచి తుదకు కరిగే మేఘం ,
పంటపొలాలకు ప్రాణం మిచ్చే నీటి చుక్క స్థావరం ,
చుక్క చుక్క రాల్చి తాను చిక్కిపోయే మేఘం ,
ఈదురు గాలిలో ఈదుకుంటూ తిరిగి తిరిగి మేఘం ,
వాన నీటిని భువిపై వదిలి నింగికెగసే మేఘం ..

ఒక అమ్మాయి బస్సు ప్రయాణం !!!

అర తెరచిన కన్నులతో అల చూస్తున్నావు,
బస్సులో కిటికీ నుండి కనపడే అందాలను విక్షించావు,
కంటి మీద కునుకు వున్న కనులు మూయవెందుకు ?
కనిపించే వింతలు అని దాచే అందుకా !!
దారిలో దేవుడు కనపడితే దణ్ణం పెట్టావు
బైకు పై వెళ్ళే పోకిరి గాళ్ళను ఛీ కొట్టావు ,
అమ్మ భుజంపై చంటిపాపను పలకరించావు ,
అందమైన అబ్బాయిలను ఓరగా చూసావు ,
గాలికి ఎగిరిన కురులను కంటికి అడ్డుగా తీసావు ,
కంటికి నచ్చిన ప్రతి అందాన్ని ఆస్వాధించావు,
మదిలో మెదిలిన ఆలోచనలను ఆద్యం పోసావు ,
దారి పొడుగునా దరహాసంతో దరికే చేరావు.