Monday, August 29, 2011

వినాయక చవితి శుభాకాంక్షలు

  రంగులద్ది , ప్లాస్టర్ తో సృష్టించిన నాయక,
 నిమజ్జనం పేరు చెప్పి నీరు మురికి చేశావా,
 సృష్టించే చేతులకు చైతన్యం కలిగించవా,
 నిన్ను మట్టితో చేసేలే మనుషుల మనసును మార్చేయవా...
 అందం చందం అంటూ ఆలోచన మరిచినారు,
 ఆయువు పోసే నీటిని విషతుల్యం చేసినారు,
 వీధి వీధి గణేశా ... వివేకమివ్వు గణేశా ....,
 ధరణిపై దారిద్ర్యం ఉండకుండా చూడవయ్యా ......

Sunday, August 14, 2011

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


స్వతంత్ర భారతం మాదని ఎందరో వీరులు ,
ఆంగ్లేయుల దుశ్చర్యలను ఎదుర్కొని,
ప్రతి మనిషి స్వేచ్చగా బ్రతకనిశ్చయించి ,
తెల్లవారి
జాడలేని దేశాన్ని ఇచ్చిరి,
స్వాతంత్ర్యం
, సమైక్యత నినాదమే ఊపిరిగా ,
ప్రతిమనిషి మనసులో సంతోషం నిండాలని ,
ప్రాణభయం వీడి స్వేచ్చతో బ్రతకాలని ,
కోరుకుంటూ
.................................. ,
స్వాతంత్ర్య
దినోత్సవ శుభాకాంక్షలు .....

Saturday, August 13, 2011

రక్షా భంధన్ !!!


తోబుట్టువు తోడుగా ఉంటానంటూ ,
కడదాక
కనిపెట్టుకు చూస్తానంటూ ,
అన్నగా
అనురాగం పంచుతూ ,
తమ్ముడై ఆనందం అందిస్తూ ,
అనుభంధపు భంధాన్ని పెంచే
భంధనం రక్షా భంధనం .....