కలిసెను మనుషులు కలలాగ
చేసెను కొలువులు ఒక మర (machine) లాగ
దారి పొడవునా ఉరుకులు ,పరుగులు
స్పాట్' (spot)లు , pride లు , రేటింగ్(ratings) లు , ఫ్రెండ్స్ తో చాటింగ్ లు
ప్రాజెక్ట్ లు ,బకెట్ లు , ప్రమోషన్ లు
టీం లంచ్(team lunch) లు , పని లేని బెంచులు(bench)
ఒత్తిడి పెరిగిన జీవితాలు
వన్నె తగ్గిన బర్త్ డే(birthday) celebrations
ఇవి మన మూడు సంవత్సరాల ముచ్చట్లు .
Thursday, November 11, 2010
Monday, November 8, 2010
ఒంటరి
ఒంటరి ఒంటరి అనకు
ఎవరు లేరని అనకు
మరణం ధరి చేరేవరకు
మౌనం వీడవు ఎందుకు?
చుట్టూ మనుషులతో
ఒక్కసారి మాట్లాడి చూడు
మనసున్న మనుషులు తారసపడి
మమతను పంచేరు చూడు !!!!
Thursday, November 4, 2010
నేటి నరకాసురులు
నరకాసుర వధ చేస్తే మొదలయేను దీపావళి ,
అ వధ తాలుకు రక్తం నర నరమున చేరి పుట్టుకొచ్చే
నేటి నరరూప రాక్షషులు .
మనిషి అన్న మాట మరచి ,
మానవత్వం మంట కలిపి
మృగం తోలు కప్పుకుని
జన జీవన సఖ్యత చెరిపి
కుల,మత చిచ్చురేపే అధికారపు ఆహంకరం
ఆసిడ్ దాడులతో , అనుమానపు వైఖరితో
ధరణిపై కత్తులతో చేసే అమానుషం.
అ వధ తాలుకు రక్తం నర నరమున చేరి పుట్టుకొచ్చే
నేటి నరరూప రాక్షషులు .
మనిషి అన్న మాట మరచి ,
మానవత్వం మంట కలిపి
మృగం తోలు కప్పుకుని
జన జీవన సఖ్యత చెరిపి
కుల,మత చిచ్చురేపే అధికారపు ఆహంకరం
ఆసిడ్ దాడులతో , అనుమానపు వైఖరితో
ధరణిపై కత్తులతో చేసే అమానుషం.
నిజమైన దీపావళి
ప్రతి ఒక్కరు ,ప్రతి క్షణము
ప్రశాంతంగా , ప్రశ్నలు లేని
ప్రమాదాలు దరిచేరని ,
ప్రజలు ఎవ్వరు భాధపడని,
ప్రపంచం అంతా సంతోషంతో ,
ప్రతి మోముపై కనిపించే ఆనందపు వెలుగులే
నిజమైన దీపావళి .....
ప్రశాంతంగా , ప్రశ్నలు లేని
ప్రమాదాలు దరిచేరని ,
ప్రజలు ఎవ్వరు భాధపడని,
ప్రపంచం అంతా సంతోషంతో ,
ప్రతి మోముపై కనిపించే ఆనందపు వెలుగులే
నిజమైన దీపావళి .....
దీపావళి శుభాకాంక్షలు
సంతోషపు వెలుగులో
ఆనందాల అరుగుపై
చెడును మంటచేసి
దాని జాడ చెరిపి వేసి
చీకటిని సాగనంపి
మంచిని ఆదరించి
మనిషిగా మసులుకొని
మానవత్వం పెంచుకొని
హాయిగా సంతోషంగా
వుండాలని కోరుకుంటూ!!!!
..... శ్రావ్యం
ఆనందాల అరుగుపై
చెడును మంటచేసి
దాని జాడ చెరిపి వేసి
చీకటిని సాగనంపి
మంచిని ఆదరించి
మనిషిగా మసులుకొని
మానవత్వం పెంచుకొని
హాయిగా సంతోషంగా
వుండాలని కోరుకుంటూ!!!!
..... శ్రావ్యం
Subscribe to:
Posts (Atom)