Saturday, November 2, 2013

దీపావళి శుభాకాంక్షలు

దీపాల వెలుగులో, దివిసీమ నీడలో,
ఆహ్లదపు అరుగులో, ఆనందపు తొటలో,
ఆత్మీయుల సమూహంలో, ఆటల పాటలతో,
లక్ష్మి పూజలతో, బంతిపూల మాలలతో,
రుచికర వంటలతో, విరజిమ్మె టపాసులతో,
మీ జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటూ,

దీపావళి శుభాకాంక్షలు


Thursday, August 8, 2013

బ్రతుకే ఒక అబద్ధం

బ్రతుకే ఒక అబద్ధం, అది నమ్మక తప్పని నిజం..

బాల్యంలో అమ్మ దగ్గర, బడి లోన గురువు దగ్గర

ప్రతి ఆటలో గెలుపు దగ్గరా.... | |బ్రతుకే| |

చదువు కాడ , ప్రతి మలుపు కాడ ,

ప్రతి గడియకు ,విగడియకు , అనుక్షణమ్ .... | |బ్రతుకే| |

యవ్వనాన ప్రేమలో , కనపడని మాయలో,

ఓడినాక దానిలో , మనసు దాచే క్రమములో | |బ్రతుకే| |

ఉద్యోగ అవకాశం , అది సాధించే రూటులో ,

ఆర్జించే ప్రతి పైసా ఖర్చు చేయు సమయంలో | |బ్రతుకే| |

పడక పైన భార్య దగ్గర , పనికాడ బాస్ దగ్గర ,

కలిసే ప్రతి వాని దగ్గర , కాటి కెళ్ళే దారి పొడుగునా .... | |బ్రతుకే| |
చుక్కల్లో చందమామ ముఖం చాటేశాడు,

తనకన్నా అందమైన అమ్మాయివి నువ్వని.

నెల పైన ప్రతి అందం అసూయ పడుతున్నాయి,

ఇంత గొప్ప అందం తమ ముందు వాలిందని.

పురివిప్పిన మయురం ముడుచుకుని పోయింది ,

అపురూప సుందరం నీ అందం అనుకుని.

తాజమహల్ చిన్నపోయే , భాధతో కూలిపోయే,

శ్వేత వర్ణ సుందరి తనకు పోటి అవుతుందని.

చిన్ననాటి కలవా

చిన్ననాటి కలవా, చిగురించిన ఆశవా ,

చెరిగిపోని గురుతువా,మరువలేని జ్ఞాపకమా ,

కనులతోనే సంభాషించే కమనీయ రూపమా,

నడకతోనే నను కట్టేసే నాట్య మయురివా,

అనుక్షణం నను కవ్వించే అపురూప కల్పనవా,

అడుగడుగునా నా తోడుండే అరుదైన మిత్రమా.

happy Friendship day


Thursday, January 10, 2013

సంక్రాంతి శుభాకాంక్షలు !!!

సంక్రాంతి ...
సంబరాల జోరు వానలో ,
తేలియాడే ప్రజలు,
గాలిపటాల రెప రెపలలో,
సవ్వడిచేసే  చిన్నపిల్లలు ,
రంగోలి రథం ముగ్గులతో ,
ముస్తాబైన వీధి సంధులు,
పిండి వంటల ఘుమఘుమలు  ,
బసవన్న సన్నాయి పద విన్యాసం ,
హరిదాసుల హరినామ కీర్తనలు,
భోగి మంటలు, కోడి పందాలు,
అల్లుడి అలకలు, పడుచుల వయ్యారాలు,
వెరసి సంక్రాంతి అందరికి
సంతోషాలని పంచాలని కోరుకుంటూ .....

మీ
శ్రవణ్ కుమార్ కర్నాటి