Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏడాది గడిచింది , దశాబ్దం ముగిసింది
ఎన్నో మలుపులు , మరెన్నో తలపులు
మిగిల్చి పోతుంది , ముగిసి పోతుంది .
సరికొత్త శకం , మరికొన్ని గడియల్లో
మన ముందుకొచ్చి మొదలవ్వనుంది
పలుకుదాం స్వాగతం ,కలిసి మెలసి ఉందాం
అందరం ఒక్కటే అనే మాట చాటుదాం .

నూతన సంవత్సర శుభాకంక్షలతో ....
.................................శ్రావ్యం (Sravan Kumar Karnati)

Thursday, December 30, 2010

నేను ,2010

Software life
సాఫీగా సాగే జీవితం , సాంగత్యం లేక శోకించే
software సానుకూలంగా లేక శాంతి కరువాయే
facets fate మార్చే , నేను java మరచిపోయే
recession తగ్గి ,relax mode లో Rx లో చేరా
మల్లి java లో జాగింగ్ స్టార్ట్ చేసి ,
spring తో జంపింగ్ ప్లాన్ చేసి , వద్దుకే అనుకుని
pramotion కోసం వెయిట్ చేస్తూ
ప్రయాణం సాగిస్తూ, ప్రశాంతత వెతుకుతున్న ....

Social Service life
సాటి మనిషికి సహాయ పడాలని
స్నేహితులతో V2HelpU స్థాపించి
కొందరి మోములో ఐన సంతోషం చూడాలని
మేము చేసే ప్రయత్నం సంతోషకరం.

Personnel life::
వెంకు (నా మేనకోడలు ) , వేకువతోనే తన కేరింతలు
చిన్నమామ అనే పిలుపుతో రోజు ఆరంబించి
తన అల్లరితో,అలకతో పాన్పుపైకి చేరడం .
రిలీజ్ ఐన సినిమా కారణం లేకుండా చూస్తూ
రిలీఫ్ టీం లంచ్ లు , సాయంత్రం మిర్చి బజ్జిలతో
భాధలు సంతోషాల మేళవింపు తో ఎన్నో మలుపులు
తిరుగుతూ సాగుతున్న జీవితం నాది.

Tuesday, December 28, 2010

Feelings Of 2010

కర్నూలు వరదలు , కడుపు మంటలు
ఆసిడ్ దాడులు , ఆకలి చావులు
ఇవన్ని లేని ప్రయాణం చేయాలనుకున్న
కాని !!!!!!!
అడుగడుగున అన్యాయం , అమాత్యుల అరాచకం
ప్రతి గల్లి ప్రాంతీయ వాదం, ఆపుచేసే పాటశాల చదువు
రాజకీయ దుమారం ,మారిన సమీకరణం
మండిన ఎండలు , మాడిన బ్రతుకులు
"జల్" తుఫాను తుడిచిపెట్టేను పంటపొలాలు
పెరిగిన ధరలు ,పెంచెను కష్టాలు
మారిన మంత్రిగనం, మల్లి మునిగినా పంటలు
పంట మిగలధాయే , రైతు చావు ఆగకపాయే
ప్రతి పార్టీ దీక్ష పూని , దీక్ష దక్షతను చెరిపే
ఈ రాజకీయ రణరంగం నేను (2010) వెళుతున్నా ఆగధాయే
ప్రశాంత జీవనాన్ని నేను (2010) మీకు ఇవ్వకపాయే ..
మీ
శ్రావ్యం (Sravan kumar Karnati)