విజ్ఞత విజ్ఞానం మరచి విధ్వంసం సృష్టించే
పదకవితా పితామహుడి పాదాలు విరిచెను
విప్లవ కవి వెన్నువిరిచి , కందుకూరి గుండె చెరచి
తెలంగాణ పేరుతో ,తెలుగు ఖ్యాతి మంటకలిపి
రాయలు ,జాషువ మరి కొందరి మహామహుల
విగ్రహాలు విరిచి, చెల్లాచెదురు చేసెనే
ఉద్యమం పేరుతో ఉన్మాదం సృష్టించే
మీది ఒక పోరాటం ?
ఇదేనా ఉద్యమ మార్గం ?