గడియ గడియకు మారును గడియారపు గంటలు,
దాచుకుంటే దాగిపోవు హృదయంలో ప్రతి జ్ఞాపకం.
మంచిని దాచుకుని , చెడుని వదులుకుని,
తప్పుని తరిమి కొట్టి, తడబాటుని అధిగమించి,
విజ్ఞత విలువపెంచి, విజయుడవై నువ్వు నిలిచి,
మానవత్వపు మాలని మనసులో ధరించి ,
సాటి వారిని ప్రేమించి, సమాజ హితం కోరి,
పరిశుభ్రత పాటించి, పచ్చధనం పెంచేసి,
శక్తిని నిలువ చేసి, ప్రతిశక్తిగా నువ్వు మారి,
రాబోవు తరానికి మార్గదర్శిగా నువ్వు మారి,
సరికొత్త ప్రపంచానికి సైనికుడివి అవ్వాలని
కోరుకుంటూ ....
నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!