రాయి రాయి పేర్చితే, నిడనిచ్చు గూడు ,
అదే రాయి విసిరితే, రక్తమొచ్చు చూడు,
రక్త ధారా పారించి, సాధించేది ఏముంది ?
చరిత్రంత చదివిన, నువ్వు, నేర్చుకున్నదేముంది?
ప్రేమించే గుణముంటే, పదిమంది మనవెంటే,
ప్రేమించని మనసుకి క్షణ క్షణం చికాకే.
మన చుట్టూ కనపడే ప్రతి ప్రాణినీ క్షేమంగా,
చూసుకునే భాద్యత, నీదే కదా సోదరా.
Wednesday, December 28, 2011
Monday, December 26, 2011
Feelings of 2011
సరికొత్త ఆశలతో వచ్చాను మీ ముందుకు,
తారీకులు మారుతున్న, మారని తలరాతలు,
పెరుగుతున్న ధరలతో పెరిగిపోయే పేదరికం,
అడుగడుగున అవీనితి, కోట్లకొలది కుంభకోణం ,
కాలం కాటేసి , కటకటాల పాలు చేసే.
ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని అన్నా,
తమ వారికి వద్దన్న మన దేశ పెద్దన్న(ప్రధాని),
ప్రాంతీయ విబేధాలు, సమ్మెలు , గొడవలు,
ప్రతిక్షణం మారిన రాజకీయ రంగులు,
పండించిన ధాన్యం రైతు నోరు చేరధాయే,
మనం చేసే తప్పుకి, ప్రకృతి పగ పట్టి,
త్రాగటానికి చుక్క నిరు లేక నిరసించే ప్రతి jeevi ,
సంతోషం పంచలేక ప్రయాణం ముగించా,
సరికొత్త సంవత్సరం అందరికి సంతోషాలని పంచాలని,
నూతన సంవత్సర శుభాకాంక్షలతో , మీ 2011.....
తారీకులు మారుతున్న, మారని తలరాతలు,
పెరుగుతున్న ధరలతో పెరిగిపోయే పేదరికం,
అడుగడుగున అవీనితి, కోట్లకొలది కుంభకోణం ,
కాలం కాటేసి , కటకటాల పాలు చేసే.
ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని అన్నా,
తమ వారికి వద్దన్న మన దేశ పెద్దన్న(ప్రధాని),
ప్రాంతీయ విబేధాలు, సమ్మెలు , గొడవలు,
ప్రతిక్షణం మారిన రాజకీయ రంగులు,
పండించిన ధాన్యం రైతు నోరు చేరధాయే,
మనం చేసే తప్పుకి, ప్రకృతి పగ పట్టి,
త్రాగటానికి చుక్క నిరు లేక నిరసించే ప్రతి jeevi ,
సంతోషం పంచలేక ప్రయాణం ముగించా,
సరికొత్త సంవత్సరం అందరికి సంతోషాలని పంచాలని,
నూతన సంవత్సర శుభాకాంక్షలతో , మీ 2011.....
Wednesday, October 5, 2011
Sunday, September 4, 2011
ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు
Monday, August 29, 2011
వినాయక చవితి శుభాకాంక్షలు
రంగులద్ది , ప్లాస్టర్ తో సృష్టించిన నాయక,నిమజ్జనం పేరు చెప్పి నీరు మురికి చేశావా,
సృష్టించే చేతులకు చైతన్యం కలిగించవా,
నిన్ను మట్టితో చేసేలే మనుషుల మనసును మార్చేయవా...
అందం చందం అంటూ ఆలోచన మరిచినారు,
ఆయువు పోసే నీటిని విషతుల్యం చేసినారు,
వీధి వీధి గణేశా ... వివేకమివ్వు గణేశా ....,
ధరణిపై దారిద్ర్యం ఉండకుండా చూడవయ్యా ......
Sunday, August 14, 2011
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
స్వతంత్ర భారతం మాదని ఎందరో వీరులు ,
ఆంగ్లేయుల దుశ్చర్యలను ఎదుర్కొని,
ప్రతి మనిషి స్వేచ్చగా బ్రతకనిశ్చయించి ,
తెల్లవారి జాడలేని దేశాన్ని ఇచ్చిరి,
స్వాతంత్ర్యం , సమైక్యత నినాదమే ఊపిరిగా ,
ప్రతిమనిషి మనసులో సంతోషం నిండాలని ,
ప్రాణభయం వీడి స్వేచ్చతో బ్రతకాలని ,
కోరుకుంటూ.................................. ,
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .....
Saturday, August 13, 2011
రక్షా భంధన్ !!!
Saturday, June 18, 2011
నా పుట్టిన రోజు !!!!

మొదటి గడియలు మూడు మనసుల గ్రీటింగ్స్,
వేకువ జామున చేసాను గుడిచుట్టు రౌండ్స్ ,
మా వెంకు చూస్తుందని దాచేస చాక్లెట్స్ ,
అందరికి ఇవ్వటానికి తీసుకున్న స్వీట్స్ ,
మధ్యలో లిఫ్ట్ చేశా ఇంకంమింగ్ కాల్స్ ,
ఫ్రెండ్స్ తో కానిచ్చ ఈవెనింగ్ చాట్స్,
రోజులో కట్ చేశా ముచ్చటగా త్రీ కేక్స్ ,
ప్రతి గడియ పెంచింది రోజులో హై లైట్స్ .
Friday, June 17, 2011
కవిత...
మనసులోని భావాలకు అక్షర మాలిక ,
సౌందర్య విశ్లేషణ నీతోనే తేలిక ....
మొదలెట్టా నీతో ప్రయాణం , ఒక కల్పనగా ,
దాచేసా మిమ్మల్ని బ్లాగులో భద్రంగా ....
మనసుతో చూసాను ప్రకృతిలో ప్రతి అందాన్ని ,
పరవశించి రాసాను దానిలోని భావాన్ని ....
కన్నులతో చూసాను కల్తి సమాజాన్ని,
కలంతో తెలిపాను అక్షర సత్యాన్ని ....
సౌందర్య విశ్లేషణ నీతోనే తేలిక ....
మొదలెట్టా నీతో ప్రయాణం , ఒక కల్పనగా ,
దాచేసా మిమ్మల్ని బ్లాగులో భద్రంగా ....
మనసుతో చూసాను ప్రకృతిలో ప్రతి అందాన్ని ,
పరవశించి రాసాను దానిలోని భావాన్ని ....
కన్నులతో చూసాను కల్తి సమాజాన్ని,
కలంతో తెలిపాను అక్షర సత్యాన్ని ....
కోయిలమ్మ ...................
రాగల పల్లకిలో కోయిలమ్మ ...
కుహు కుహు అంటుంది పాటలమ్మ...
రూపేమో నలుపు ,
మనసు మనతో కలుపు,
పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ,
తన పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ....
ఆకాశాన విహారి ,
చెట్టే తన జాగిరి ,
కుహు కుహు అంటూనే ,కూనిరాగాలు తీస్తుంది ...
కవుల పాటకు ప్రతిమ ,
స్వరసంపదే తన విలువ ,
కలిసి పాడమంటూ సవాలే విసిరింది .
తనతో, కలిసి పాడమంటూ సవాలే విసిరింది,
కుహు కుహు అంటుంది పాటలమ్మ...
రూపేమో నలుపు ,
మనసు మనతో కలుపు,
పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ,
తన పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ....
ఆకాశాన విహారి ,
చెట్టే తన జాగిరి ,
కుహు కుహు అంటూనే ,కూనిరాగాలు తీస్తుంది ...
కవుల పాటకు ప్రతిమ ,
స్వరసంపదే తన విలువ ,
కలిసి పాడమంటూ సవాలే విసిరింది .
తనతో, కలిసి పాడమంటూ సవాలే విసిరింది,
Thursday, June 16, 2011
Wednesday, June 15, 2011
అర్ధం కాని పుస్తకం
అర్ధం కాని పుస్తకం , నా జీవితం.
విషయ సూచిక అసలే లేని ప్రయాణం .
ప్రతి పాటం నేర్పింది ఒక గుణపాటం.
పేజి పేజి తెచ్చింది నాలో మార్పు అనుక్షణం .
పేజి తిప్పితే ఏముంటుందో అన్న భయం ,
ఉన్న పెకిలో ఉండనివ్వని జీవన చక్రం.
బాష ,యాస అక్కరలేని జీవిత గ్రంధం ,
తెరచి చూస్తే కనిపించే ప్రతివాడి గతం .
మొదటి అడుగులో అచ్చులు నేర్చి ,హావ భావాల హల్లులతో ,
సాగించా నే ప్రయాణం, కొనసాగించా నా జీవనయానం.
విషయ సూచిక అసలే లేని ప్రయాణం .
ప్రతి పాటం నేర్పింది ఒక గుణపాటం.
పేజి పేజి తెచ్చింది నాలో మార్పు అనుక్షణం .
పేజి తిప్పితే ఏముంటుందో అన్న భయం ,
ఉన్న పెకిలో ఉండనివ్వని జీవన చక్రం.
బాష ,యాస అక్కరలేని జీవిత గ్రంధం ,
తెరచి చూస్తే కనిపించే ప్రతివాడి గతం .
మొదటి అడుగులో అచ్చులు నేర్చి ,హావ భావాల హల్లులతో ,
సాగించా నే ప్రయాణం, కొనసాగించా నా జీవనయానం.
Tuesday, June 14, 2011
బడిపిల్లలు
ఒడి ఒడిగా అడుగులు వేసే , బడివైపు పరుగులు తీసే ,
గడ్డిమోపు బరువే వున్న భ్యాగులనే భుజాన వేసే ,
హలిడేసు హారతిల ఆవిరి ఐతే ,
ఏడుపుతో కొందరు, ఎదుగుధలకై కొందరు ,
భవితనే బంగారం చేయ నిశ్చయించి ....
........|| ఒడి ఒడిగా ||
బడిలోన పంతులే ,పాటలు చెప్పితే ,
పైన కింద పడుతూనే , చెప్పింది రాసుకుని ,
చదువాలని కొందరు , చదువలేని ఎందరో ..
.........||ఒడి ఒడిగా ||
సర్కారు చదువులు, ఎడారిలో ఎండమావులు
కనిపించని పుస్తకాలు , కనిపించే పురుగులు ,
అడుగడుగున అవస్థలు , తలకెక్కని అమాత్యులు ..
ఐనా సరే అంటూ || ఒడి ఒడిగా||
గడ్డిమోపు బరువే వున్న భ్యాగులనే భుజాన వేసే ,
హలిడేసు హారతిల ఆవిరి ఐతే ,
ఏడుపుతో కొందరు, ఎదుగుధలకై కొందరు ,
భవితనే బంగారం చేయ నిశ్చయించి ....
........|| ఒడి ఒడిగా ||
బడిలోన పంతులే ,పాటలు చెప్పితే ,
పైన కింద పడుతూనే , చెప్పింది రాసుకుని ,
చదువాలని కొందరు , చదువలేని ఎందరో ..
.........||ఒడి ఒడిగా ||
సర్కారు చదువులు, ఎడారిలో ఎండమావులు
కనిపించని పుస్తకాలు , కనిపించే పురుగులు ,
అడుగడుగున అవస్థలు , తలకెక్కని అమాత్యులు ..
ఐనా సరే అంటూ || ఒడి ఒడిగా||
Thursday, June 9, 2011
Wednesday, June 8, 2011
స్మశానం
అందరు వున్న , అనాధవైన అక్కున చేర్చేది ,
తనువును తనలో దాచి , ఆత్మని వదిలేది ,
మరణించిన వారి అంతిమ గమ్యం ,
విరోధం అసలే కనపడని విశ్రాంతి నిలయం ,
కుల, మత , గోత్రం అడ్డురాని దేవాలయం ,
ఆదమరచి నిదురించే ఆశ్రయం,
ఎన్నికల గొడవ అసలే లేని ఎముకల గుడారం ,
ఆస్తి తగాదాలు కానరాని అస్తికల నిలయం ,
అందం ,చందం , ఆభరణం అక్కరలేని అస్థిపంజరం
అడుగడుగున కనపడుతూ సృష్టించే మనలో భయం.
తనువును తనలో దాచి , ఆత్మని వదిలేది ,
మరణించిన వారి అంతిమ గమ్యం ,
విరోధం అసలే కనపడని విశ్రాంతి నిలయం ,
కుల, మత , గోత్రం అడ్డురాని దేవాలయం ,
ఆదమరచి నిదురించే ఆశ్రయం,
ఎన్నికల గొడవ అసలే లేని ఎముకల గుడారం ,
ఆస్తి తగాదాలు కానరాని అస్తికల నిలయం ,
అందం ,చందం , ఆభరణం అక్కరలేని అస్థిపంజరం
అడుగడుగున కనపడుతూ సృష్టించే మనలో భయం.
మేఘం!!!
ఉరిమి ఉరిమి వాన తానై ఉరకలేసే మేఘం
మబ్బు తానై మండుటెండలో గొడుగు తానై మేఘం ,
వాన నీటిని తనలో దాచి తుదకు కరిగే మేఘం ,
పంటపొలాలకు ప్రాణం మిచ్చే నీటి చుక్క స్థావరం ,
చుక్క చుక్క రాల్చి తాను చిక్కిపోయే మేఘం ,
ఈదురు గాలిలో ఈదుకుంటూ తిరిగి తిరిగి మేఘం ,
వాన నీటిని భువిపై వదిలి నింగికెగసే మేఘం ..
మబ్బు తానై మండుటెండలో గొడుగు తానై మేఘం ,
వాన నీటిని తనలో దాచి తుదకు కరిగే మేఘం ,
పంటపొలాలకు ప్రాణం మిచ్చే నీటి చుక్క స్థావరం ,
చుక్క చుక్క రాల్చి తాను చిక్కిపోయే మేఘం ,
ఈదురు గాలిలో ఈదుకుంటూ తిరిగి తిరిగి మేఘం ,
వాన నీటిని భువిపై వదిలి నింగికెగసే మేఘం ..
ఒక అమ్మాయి బస్సు ప్రయాణం !!!
అర తెరచిన కన్నులతో అల చూస్తున్నావు,
బస్సులో కిటికీ నుండి కనపడే అందాలను విక్షించావు,
కంటి మీద కునుకు వున్న కనులు మూయవెందుకు ?
కనిపించే వింతలు అని దాచే అందుకా !!
దారిలో దేవుడు కనపడితే దణ్ణం పెట్టావు
బైకు పై వెళ్ళే పోకిరి గాళ్ళను ఛీ కొట్టావు ,
అమ్మ భుజంపై చంటిపాపను పలకరించావు ,
అందమైన అబ్బాయిలను ఓరగా చూసావు ,
గాలికి ఎగిరిన కురులను కంటికి అడ్డుగా తీసావు ,
కంటికి నచ్చిన ప్రతి అందాన్ని ఆస్వాధించావు,
మదిలో మెదిలిన ఆలోచనలను ఆద్యం పోసావు ,
దారి పొడుగునా దరహాసంతో దరికే చేరావు.
బస్సులో కిటికీ నుండి కనపడే అందాలను విక్షించావు,
కంటి మీద కునుకు వున్న కనులు మూయవెందుకు ?
కనిపించే వింతలు అని దాచే అందుకా !!
దారిలో దేవుడు కనపడితే దణ్ణం పెట్టావు
బైకు పై వెళ్ళే పోకిరి గాళ్ళను ఛీ కొట్టావు ,
అమ్మ భుజంపై చంటిపాపను పలకరించావు ,
అందమైన అబ్బాయిలను ఓరగా చూసావు ,
గాలికి ఎగిరిన కురులను కంటికి అడ్డుగా తీసావు ,
కంటికి నచ్చిన ప్రతి అందాన్ని ఆస్వాధించావు,
మదిలో మెదిలిన ఆలోచనలను ఆద్యం పోసావు ,
దారి పొడుగునా దరహాసంతో దరికే చేరావు.
Tuesday, May 31, 2011
అమ్మాయి ......
అమ్మ ఒడిలో పెరిగి, నాన్న కరుణ రుచి చూసి,
అన్నదమ్ముల అభిమానంలో మునిగి,
ఆరుబయట ఆడుకున్న ఆటలు ఎన్నో,
తోటివారితో పాడుకున్న పాటలు ఎన్నో,
రోజులు తిరిగి తిరిగి, నెలలన్నీ కరిగి,
పెళ్లి ముహూర్తం వచ్చెనమ్మ, కొత్త జీవితం ఇచ్చునమ్మ,
పెళ్లి పందిరి ,అదిగో పెళ్లి పందిరి ,
ఎన్నో ఆశల లోగిలి, కొత్త జీవితపు వాకిలి ,
ముహూర్త సమయం వచ్చనే , మూడు ముళ్ళు వేసేనే,
ముచ్చటగా వరుడు ముంగిట నిలిచి , కొత్త జీవితం యిచ్చునే,
తలంబ్రాల తాళాలు , చప్పుడు చేసే మేళాలు ,
దైవదూతల అనిపిస్తూ దీవించే ఆత్మీయులు,
అంపకాలు , పంపకాలు , నూతన వధువు అప్పగింతలు ,
అమ్మైనా , నాన్నైనా , అభిమానించే అన్నదమ్ములైన ..
అన్ని మిరే అంటూ , సర్వస్వం మీరంటు ,
పెల్లికుతురిని అప్పగించే అప్పగింతలు ,
సంతోష సమయాన ఏడుపు తెచ్చే అప్పగింతలు.
అమ్మ ఒడిలో పెరిగి, నాన్న కరుణ రుచి చూసి,
అన్నదమ్ముల అభిమానంలో మునిగి,
ఆరుబయట ఆడుకున్న ఆటలు ఎన్నో,
తోటివారితో పాడుకున్న పాటలు ఎన్నో,
రోజులు తిరిగి తిరిగి, నెలలన్నీ కరిగి,
పెళ్లి ముహూర్తం వచ్చెనమ్మ, కొత్త జీవితం ఇచ్చునమ్మ,
పెళ్లి పందిరి ,అదిగో పెళ్లి పందిరి ,
ఎన్నో ఆశల లోగిలి, కొత్త జీవితపు వాకిలి ,
ముహూర్త సమయం వచ్చనే , మూడు ముళ్ళు వేసేనే,
ముచ్చటగా వరుడు ముంగిట నిలిచి , కొత్త జీవితం యిచ్చునే,
తలంబ్రాల తాళాలు , చప్పుడు చేసే మేళాలు ,
దైవదూతల అనిపిస్తూ దీవించే ఆత్మీయులు,
అంపకాలు , పంపకాలు , నూతన వధువు అప్పగింతలు ,
అమ్మైనా , నాన్నైనా , అభిమానించే అన్నదమ్ములైన ..
అన్ని మిరే అంటూ , సర్వస్వం మీరంటు ,
పెల్లికుతురిని అప్పగించే అప్పగింతలు ,
సంతోష సమయాన ఏడుపు తెచ్చే అప్పగింతలు.
Friday, May 27, 2011
జీవితం
జీవితం , జీవం సాగించే ప్రయాణం ,
ఎన్నో ఆటుపోట్ల సమూహం ,
తొలి అడుగు అమ్మ కడుపులో
మళి అడుగు ఎవరి చెంతనో
చిన్ననాటి ప్రాయం చింతలు లేని ప్రాయం
చింత చెట్టులా కాగానే చికాకులే తన స్థావరం
దారిపొడుగునా దరహాసం , దారిద్ర్యం
అడుగడుగునా ఆనందం , అపోహలు
భాగ్యాలు భోగాలు భాదాలు భరించటాలు
నష్టాలు , కష్టాలు , లాభాలు లంచాలు
చిరునవ్వులు చీదరింపులు , చివాట్లు చెప్పుదెబ్బలు...
ఎన్నో ఆటుపోట్ల సమూహం ,
తొలి అడుగు అమ్మ కడుపులో
మళి అడుగు ఎవరి చెంతనో
చిన్ననాటి ప్రాయం చింతలు లేని ప్రాయం
చింత చెట్టులా కాగానే చికాకులే తన స్థావరం
దారిపొడుగునా దరహాసం , దారిద్ర్యం
అడుగడుగునా ఆనందం , అపోహలు
భాగ్యాలు భోగాలు భాదాలు భరించటాలు
నష్టాలు , కష్టాలు , లాభాలు లంచాలు
చిరునవ్వులు చీదరింపులు , చివాట్లు చెప్పుదెబ్బలు...
రాత్రి
రేపు అనే ధ్యాసతో , బ్రతుకు మీద ఆశతో
నేడు ఒక పాటంగా , రేపటి గునపాటంగా
చింతలన్ని వీదమంటూ , చీకటిని పిలుస్తుంది
మనసులోని భాదాలన్ని బయటకి పంపిస్తుంది
చికతింత అడుగుడి , వేకువనే వెళుతుంది.
నేడు ఒక పాటంగా , రేపటి గునపాటంగా
చింతలన్ని వీదమంటూ , చీకటిని పిలుస్తుంది
మనసులోని భాదాలన్ని బయటకి పంపిస్తుంది
చికతింత అడుగుడి , వేకువనే వెళుతుంది.
అందమైన ప్రయాణం ,,ఆఫీసు ప్రయాణం !!!!
బైకు తీయగానే బైపాసు రోడ్డు మీద
బలే బలే అమ్మాయి బండి మీద పోతుంది
బరువెక్కిన మనసుతో బంజరహిల్ల్స్ వస్తే
బస్సులో బుల్లెమ్మ గుండె బ్లాస్ట్ చేసింది
క్లారిటీ లేని లైఫ్ కమాన్ కి చేరగానే
కైపెక్కే కళ్ళతో మరో పాప కవ్వించే
సర్లేరా అనుకుంటూ జుబ్లిహిల్ల్స్ ఎక్కుతుంటే
జిలేభి లాంటి పిల్ల జిగేలున మెరిసింది
జిలేభిని మరవలేక మాదాపూర్ చేరినాక
సాఫ్ట్ వేర్ సాఫ్ట్ పిల్ల సైలెంట్ గా మనసు గిల్లే
ఆఫీసు చేరగానే అందమైన అమ్మాయిలు
అడుగడుగున కనపడుతూ అయోమయం చేస్తుండే .
బలే బలే అమ్మాయి బండి మీద పోతుంది
బరువెక్కిన మనసుతో బంజరహిల్ల్స్ వస్తే
బస్సులో బుల్లెమ్మ గుండె బ్లాస్ట్ చేసింది
క్లారిటీ లేని లైఫ్ కమాన్ కి చేరగానే
కైపెక్కే కళ్ళతో మరో పాప కవ్వించే
సర్లేరా అనుకుంటూ జుబ్లిహిల్ల్స్ ఎక్కుతుంటే
జిలేభి లాంటి పిల్ల జిగేలున మెరిసింది
జిలేభిని మరవలేక మాదాపూర్ చేరినాక
సాఫ్ట్ వేర్ సాఫ్ట్ పిల్ల సైలెంట్ గా మనసు గిల్లే
ఆఫీసు చేరగానే అందమైన అమ్మాయిలు
అడుగడుగున కనపడుతూ అయోమయం చేస్తుండే .
మూగబోయే మనసే
మూగబోయే మనసే నిను చూసాక
ఆగలేదు కన్నీరు మాటరాక ..
చెప్పుకున్న బాసలే గురుతురాక
చేసుకున్న ప్రమాణాలు కానరాక ...
నిను చూసిన క్షణ మొదలైన ప్రేమ వనం
నువ్వు రావని తెలిసాక ఉండగలద ఒక్క క్షణం...
కలిసున్నా రోజులన్నీ పదే పదే తలచుకుంటూ
సాగించే ప్రయాణం నిను వెతుక్కుంటూ ...
ఊహించని వుపద్ర్తవం మున్చిత్తే
కలిసుండే మనల్ని విడదిసే.......
కంటనీరు తెప్పించి ఓటరిగా నిలబెట్టి
గుండెకోత మిగిల్చి ఏకాకిని చేసే...
ఆగలేదు కన్నీరు మాటరాక ..
చెప్పుకున్న బాసలే గురుతురాక
చేసుకున్న ప్రమాణాలు కానరాక ...
నిను చూసిన క్షణ మొదలైన ప్రేమ వనం
నువ్వు రావని తెలిసాక ఉండగలద ఒక్క క్షణం...
కలిసున్నా రోజులన్నీ పదే పదే తలచుకుంటూ
సాగించే ప్రయాణం నిను వెతుక్కుంటూ ...
ఊహించని వుపద్ర్తవం మున్చిత్తే
కలిసుండే మనల్ని విడదిసే.......
కంటనీరు తెప్పించి ఓటరిగా నిలబెట్టి
గుండెకోత మిగిల్చి ఏకాకిని చేసే...
కోపం
కాయంలో రక్తమే మరిగి మరిగి pressure పెరిగి
చూస్తుండగానే ఎదుటి మనిషి మీద మాట దొర్లి
లౌక్యం మరిపించి లొల్లి లొల్లి చేసి
భందాలను తెంచేసి బద్ధ శత్రువుల చేసి
విచక్షణ పోగొట్టి మృగాలుగా మార్చేసి
మనిషి మనసుపై చెరగని ముద్రవేసే ......
చూస్తుండగానే ఎదుటి మనిషి మీద మాట దొర్లి
లౌక్యం మరిపించి లొల్లి లొల్లి చేసి
భందాలను తెంచేసి బద్ధ శత్రువుల చేసి
విచక్షణ పోగొట్టి మృగాలుగా మార్చేసి
మనిషి మనసుపై చెరగని ముద్రవేసే ......
నిదిరించు
నిదిరించు నిదిరించు నిదిరించు
నిదురలో వచ్చిన కల సాధించు
కమ్మనైన కల నిన్ను చేరేవరకు
ఆపకు నువ్వు ఆపకు నీ ప్రయాణము
సాధించు గెలుపు సాధించు
గమ్యానికి వున్న అడ్డన్కులనే తొలగించు
యుద్ధానికి వెళ్ళే సైనికుడవై
హతమార్చు శత్రువులైన ఒడిదుడుకులను
రాణించు నువ్వు రాణించు
రణరంగంలో దూకి వేట కొనసాగించు ..
నిదురలో వచ్చిన కల సాధించు
కమ్మనైన కల నిన్ను చేరేవరకు
ఆపకు నువ్వు ఆపకు నీ ప్రయాణము
సాధించు గెలుపు సాధించు
గమ్యానికి వున్న అడ్డన్కులనే తొలగించు
యుద్ధానికి వెళ్ళే సైనికుడవై
హతమార్చు శత్రువులైన ఒడిదుడుకులను
రాణించు నువ్వు రాణించు
రణరంగంలో దూకి వేట కొనసాగించు ..
నన్ను వీడిన మనసు జాడ చూసాను నేను,
తన చెంత చేరాలని వున్న కుదరదు నేడు,
ప్రేమించటం నే చేసిన నేరమ
క్షణకాలంలో చేసిన తప్పే పాపమా
జీవితకాలంలో వీడదు నన్ను ఈ వేదన
తను క్షమించకుంటే దొరకదు నాకు స్వాంతన
కన్నా వారిని కాదనుకున్న తన కోసం
తన అమ్మ మాట జవదాటలేదు ఎ క్షణం
తెలియక చేసిన తప్పును కూడా భూతద్దంలో వెతికితే
చిన్నసూది సైతం గునపమై గుండలో గుచ్చుకోద...
తన చెంత చేరాలని వున్న కుదరదు నేడు,
ప్రేమించటం నే చేసిన నేరమ
క్షణకాలంలో చేసిన తప్పే పాపమా
జీవితకాలంలో వీడదు నన్ను ఈ వేదన
తను క్షమించకుంటే దొరకదు నాకు స్వాంతన
కన్నా వారిని కాదనుకున్న తన కోసం
తన అమ్మ మాట జవదాటలేదు ఎ క్షణం
తెలియక చేసిన తప్పును కూడా భూతద్దంలో వెతికితే
చిన్నసూది సైతం గునపమై గుండలో గుచ్చుకోద...
Subscribe to:
Posts (Atom)

