Sunday, October 28, 2012

నిను చేరెను నీ  గమ్యం,
ధడిచావో  అది నిను విడువున్,
తొలగించు నీ భయం,
సాధించు నీ లక్ష్యం,
వృధా చేయకు నీ కష్టం,
ఎగురవేయు విజయ పతాకం. 

Sunday, October 14, 2012

గాలి గాలి కనపడనీ గాలి

గాలి గాలి కనపడనీ గాలి,
వీచి వీఛి మా ఆయువు పోసి,
నీరే లేక పొడిగా నువు మారి ,
వేడే పెరిగి మము కాల్చు గాలి,
కోపం వస్తే సుడిగాలి నువ్వు అయ్యి,
ఊరంతటిని ఊడ్చేసే గాలి,
చలి కాలం రా రా అనగానే ,
వెంటనే వచ్చి వనికించు గాలి,
గాలి గాలి కనపడని గాలి,
వీచి వీచి మా ఆయువు పోసి .......

Monday, October 1, 2012

వర్షపు చుక్క లేక భూమేమో ఎండిపోయే ,
వానమ్మ కరునించక చెట్టేమో మాడిపోయే,
పొట్ట చేత పట్టుకుని రైతన్న పట్నం వస్తే,
పంట చేను దిక్కులేక భీడుగా మారిపోయే,
కూలి నాలి చేసీ కండలన్నీ కరిగిపోయే,
తిండి గింజ రేటు మాత్రం ఆకశానా ఉండిపోయే,
నదులన్నీ ఇంకిపోయి ఆనకట్ట తెరువరాయే,
చుక్కనీరు లేక, డెల్టా దిగుబడి పడిపోయే,
చూసే వారు లేక ఊరే ఎడారి ఆయే,
పచ్చని చెట్టు నీడ చందమామ చంధమాయే ....