Sunday, February 28, 2010

హొలీ


రాక్షస వధని సంబరాల జోలిలో
ముంచెత్తే రంగుల హొలీ
పలురకాల జీవన చిత్రాలను
చూపే రంగుల మేళవింపు
మన రంగుల హొలీ
ఎరుపు ఉత్సాహాన్ని
ఆకు'పచ్చ'ధనాన్ని
పసుపు మంచి తనాన్ని
తెలుపులోని స్వేచ్చ ,శాంతిని
అందరికి ఇవ్వాలని కోరుకుంటూ
--- మీ శ్రావ్యం

Saturday, February 27, 2010

కార్పొరేటు లైఫ్

కాలేజి కుర్రకారు ,కార్పొరేటు ఆఫీసు
కాలిటైము అనగానే గోల గోల చేసేరు
కాలం కరిగి కరిగి మొదలయేను కష్టాలు
కర్పోరేటు కంపనిలో ఫ్రీటైం కలగా మారిపాయే
కాఫీకి కూడా కాస్త టైం కూడా లేదాయే
కలిసి లంచ్ అనే ఊసు అసలే రాదాయే

Friday, February 26, 2010

తెలుగుకు తెగులు


తెలుగుకు తెగులు పట్టినవేల
విద్యార్ధికి వ్యధను పెంచెను
ఉపాధ్యాయ లోకం తలదిన్చేల
ఇంగ్లీష్ చదువులంటూ
ఇంగితం మరిచారు
మాతృభాష వద్దంటూ
మృగాలుగా మిగిలినారు

Wednesday, February 24, 2010

పొగమంచు కమ్మేసింది
ఆమె ఆగమనానికి ఆశలు పెంచింది
మా ప్రయాణం ఆపేసింది
అడుగడుగున ఆపేసి
మా ఆనందం మాయచేసి తను ఆనందపడింది

('Aame' indicates "trafic")

ఉదయం


ప్రతిరోజుకు ఆరంభం ఉదయం
నిన్న మరచి ,నేడు చూపే
చెడుని వీడి ,మంచినేంచి
భాధలోదలి బ్రతుకుటకు మరో అవకాశం ఉదయం
కాలం విలువను తెలిపి
కాలరాత్రిని వీడి,
కొత్తలోకం చూపేందుకు
కోటి ఆశలతో వస్తుంది ఉదయం
ప్రశాంత వదనముతో
ప్రకృతి ఆరాధనతో
ప్రజల శ్రేయస్సు కోరి
ప్రపంచాన్ని మేల్కొలిపేది ఉదయం

Monday, February 22, 2010

కలల సుందరి


కలల సుందరి ,
నిద్రలేవగానే నింగికేల్లిపోతుంది .
పడక గది చేరగానే
పలకరిస్తుంది ,
ఒంటరిగా వుంటే
ఓనమాలు నేర్పుతుంది ,
అందరితో ఉంటె
ఆనందం ఇస్తుంది
భాధాల్లో ఉంటె
బరువెక్కిన గుండెని ఓదార్చి పోతుంది

software సీతక్క

ఎమున్నధక్కో , ఎమున్నధక్కో ..
సితక్కంటివి , software అంటివి
ఎంవచ్చుఅని చేరితివక్కో
ఏమొచ్చు అక్కో , నీకు ఏమొచ్చు అక్కో
అడవులంటివి , అన్నలంటివి
సర్కారుతో చర్చలంటివి ..
ఏమైనది అక్కో , చర్చలు ఏమైనవక్కో
reservationantu , జాబులిస్తామంటూ
కంప్యూటర్ కంపెనీ లో కుర్చిఇచ్చినారు
డబ్బాలేన్తివో(monitor) , documentlentivo
ఎలుక(mouse) use నీకు తెలిధాయే అక్కో
ఎమున్నధక్కో , ఈడ నీకు ఎమున్నధక్కో

(if Ex-naxal seethakka join in a software company)

Saturday, February 20, 2010

ఎవరో వచ్చారు

పక్కనే నిలిచారు

చూస్తూనే వున్నాను

మాట్లాడ తలచాను

మదనపడిపోయాను

తలతిప్పి చూసాను

తన రూపును దాచాను


మండుటెండలో మంచు ముత్యమా !!!


మండుటెండలో మంచు ముత్యంలా
ఆనంద సమయంలో అందని జాబిల్లిలా
చీకటిని మరిపించే కురులతో
నీ అందాన్ని రెట్టింపు చేసే వస్త్రధారనతో
కనులముందు కదలాడుతూ కవ్వించావు
మాట్లాడేలోపే మాయమయ్యావు

Wednesday, February 17, 2010

Trafic@Hyderabad


భాగ్యనగర బస్తీలో , భంజారహిల్స్ రోడ్డుపై
అమీర్పేట్ చౌరస్తా ,అసెంబ్లీ రోడ్డు కాడ
అడుగడుగున ట్రాఫిక్కు , ఇరుక్కునే vehicles
ఎనిమిధైతే చాలు ఏరులా పారుతుంది
పదిగంటలు కొట్టగానే ఎరుకాస్త ఎండుతుంది
మధ్యాహ్నం,రోడ్డు కాస్త కాలిగానే వుంటుంది
సాయంత్రం వేల ప్రతిసందు నిండిపోతుంది
హైటెక్కు రోడ్డు పైన హైస్పీడు బండి సైతం
ఆగి ఆగి ముందుకేలుతు హైరానా పడుతుంది
బస్సు ,కారు , బైక్ అని లేనేలేదు
కాలినడక సైతం తనకు బంది అంటుంది
ఆటోలు అరడజను అడ్డంగా వదిలే పొగ
పిల్చావో ఎక్కుతుంది కాలుష్యపు నిషా
(dedicated to you, who are all suffering from trafic@hyderabad)

Monday, February 15, 2010

నిను చూసిన క్షణాన

నిను చూసిన క్షణాన మొదలైన అలజడి ప్రేమ ప్రేమ అంటున్నది
అలజడిలో రాలిన స్వేద బిందువు లో నీరూపు నాకు కనపడినది
నీ రూపం నా ప్రతిరూపం కావాలని ,
నీ మనసు నా మనసుతో ఊయలూగాలని
నిండు నూరేళ్ళు నీతో నా జీవన పయనం సాగాలని కోరుకుంటూ నీ ప్రేమ పిపాసి.
(dedicated to my friend for the sake of his girlfriend)

Thursday, February 11, 2010

ప్రేమ చేరువైన వేల


మదిలో జరిగే ఆరాధనా ప్రేమ ప్రేమ అంటున్నది
ఎదలో రగిలే ఆవేదన ప్రేమ ప్రేమ అంటున్నది
నీ కన్నులలో కైపేలా నా మనసంతా కరిగేలా
చిరునవ్వుల మధురిమలే ,గిలిగింతలు పెట్టేలా
తీయని దరహాసం చిలిపి పనులు చేసేలా
రాతినైన నా హృదయంలో రాగాలు పలికిన వేల
హాయినిచ్చే సావాసంలో ఆశలెన్నో వుధయించేలా
రేపు అనే ధ్యాసేలేని జీవితాన్ని అందించేనా
అనునిత్యం తననే తలిచే ఆకర్షణగా నిలిచే వేల
తన సాంగత్యం లోనే సరిగమలు పలికిన్చేనంటా
(Dedicated for those who are in Love)

చివరి ప్రేమ లేఖ


అతిమధురం సుంధరవధనం నీ నయనం
నీ దరహాసపు జల్లులో సేధతిరాలని
ఉవ్విల్లురుతూ ఆగమేగాలమీధ
నిను ఆశ్రయించిన నా మనసుకు
నీ విరహం తగునా !!!
నీ ప్రేమ లేని ఈ దేహం నాకెందుకు?
ఈ కకావికలం అయిన మనసు నాకెందుకు
అందుకే, ఈ, నీ విరహ వేదన ఓపలేక
జనవాహినికి దూరంగా పయనమవుతున్న
ఈ నీ చిరకాల ప్రేమికుడు ......
నీపై నా ప్రేమ అతులితం ,అనంతం ,అపూర్వం .

కనిపించని ఓ అందమా!!!


కలలో ఇలలా, ఇలలో కలలా
కనులకు కనపడని ఓ అందమా
చెవులకు వినిపించే నాదమా
చిలుక పలుకల మాటలతో
చిరుదివ్వెలు వెలిగించే నా హృదయంలో
నీ రూపు తెలియని ఊహలతో
ఉప్పెన ఐయ్యే నా ఆవేదన
నీ ఆలోచనల ఆకలింపుతో
క్షణమొక యుగమై నిలుచున్నా

ప్రేమ విలువ


ప్రేమలేని జీవితం వ్యర్ధం
ప్రేమించలేని మనస్సు అనర్ధం
ప్రేమలేని చోట వ్యవస్థ ఎప్పుడు అస్తవ్యస్తం
ప్రేమను జయించలేదు ఎ అర్థం
ప్రేమకు కావాలి గొప్ప స్థామర్త్యం
స్థామర్త్యం లేని ప్రేమ వ్యర్థం
ప్రేమగురించి తెలుసుకోవటమే జీవిత పరమార్ధం
పలురకాల అనుభవాల చిట్టాలపై ఈ ప్రేమరధం.

ప్రేమ నివేక్కడ

ఆగి ఆగి అలసిన ,ఎదురు చూసి నిలచిన
కుమిలి కుమిలి ఏడ్చినా ,భాధలోనే మునిగిన
నవ్వాలని చూసిన కుదరక చింతించిన
ఇదంతా ఏమిటంటే ,నీ స్వరం వినని లోకమంటూ
ఎలా ఉండగలదు అంటూ ,
నా మనసులోని భాదనే భయటకు వెదజల్లిన

ప్రేమ

అపరిచితులను ఆత్మియులగచెసి
అనురాగం పంచుటకు అమ్మవై పుట్టి
మమకారం చూపుటకు నాన్నవై
ఆటపాటలకు అన్నాచేల్లిలా
సరదాలకి స్నేహితునిలా
అభ్యాసానికి ఆచార్యునిలా
ప్రశాంతతకి ప్రకృతివై
ఆనందానికి అందానివై
భాధాల్లో ఒదార్పువై
యువతీ యువకుల మనస్సులలో చేరి
దొబుచులాడినావు, రెండును ఒకటి చేసినావు
ప్రేమికులుగా కలిపినావు , ప్రణయ రాగం పాడినావు
ప్రేమవై నిలచినావు

Sunday, February 7, 2010

సంధ్యా సాగరం


సంధ్యా సమయం,సాగర విహారం
ఆకాశంలో సూర్యచంద్రుల గమనాగమనాలు
ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు
ఇసుక తిన్నెలు ,
ఆనంద సంద్రంలో అందరు
ప్రశాంత పందిరిలో మరికొందరు
సేధతిరే సాయంత్రం సమయాన .....

అరకు ప్రయాణం


విశాఖ మన్యం ,ఒక అరణ్యం
ప్రకృతి శోభకు నిలయం
విహంగాల ప్రణయం
ఘాట్ రోడ్ వలయం
అక్కడ లబించును స్వేచ్చ మారుతం
కటికి జలపాతం చల్లదనం
కాఫీ తోటల పచ్చదనం
గిరిజనుల జీవన చిత్రం
పూల తోటల పరిమళం
బొర్రా గుహల సోయగం
అరకు ప్రయాణం

Tuesday, February 2, 2010

గులాబీ


గుబురు గుబురు గా వుండి
అందరి గుండెలను దోచేది గులాబీ
మనోహరమైన ఆకృతితో
తనకు ఆకర్షితులను చేసేది గులాబీ
తన పరిమళాన్ని ప్రసరించి
ప్రణయ ప్రపంచాన్ని ఎలేది గులాబీ
రంగు రంగుల రూపాలలో
రమణి మనసును దోచేది గులాబీ
తన కాడాకున్న ముళ్ళని చూపి
మనల్ని అప్రమత్తం చేసేది గులాబీ