Thursday, February 11, 2010

కనిపించని ఓ అందమా!!!


కలలో ఇలలా, ఇలలో కలలా
కనులకు కనపడని ఓ అందమా
చెవులకు వినిపించే నాదమా
చిలుక పలుకల మాటలతో
చిరుదివ్వెలు వెలిగించే నా హృదయంలో
నీ రూపు తెలియని ఊహలతో
ఉప్పెన ఐయ్యే నా ఆవేదన
నీ ఆలోచనల ఆకలింపుతో
క్షణమొక యుగమై నిలుచున్నా

ప్రేమ విలువ


ప్రేమలేని జీవితం వ్యర్ధం
ప్రేమించలేని మనస్సు అనర్ధం
ప్రేమలేని చోట వ్యవస్థ ఎప్పుడు అస్తవ్యస్తం
ప్రేమను జయించలేదు ఎ అర్థం
ప్రేమకు కావాలి గొప్ప స్థామర్త్యం
స్థామర్త్యం లేని ప్రేమ వ్యర్థం
ప్రేమగురించి తెలుసుకోవటమే జీవిత పరమార్ధం
పలురకాల అనుభవాల చిట్టాలపై ఈ ప్రేమరధం.

ప్రేమ నివేక్కడ

ఆగి ఆగి అలసిన ,ఎదురు చూసి నిలచిన
కుమిలి కుమిలి ఏడ్చినా ,భాధలోనే మునిగిన
నవ్వాలని చూసిన కుదరక చింతించిన
ఇదంతా ఏమిటంటే ,నీ స్వరం వినని లోకమంటూ
ఎలా ఉండగలదు అంటూ ,
నా మనసులోని భాదనే భయటకు వెదజల్లిన

ప్రేమ

అపరిచితులను ఆత్మియులగచెసి
అనురాగం పంచుటకు అమ్మవై పుట్టి
మమకారం చూపుటకు నాన్నవై
ఆటపాటలకు అన్నాచేల్లిలా
సరదాలకి స్నేహితునిలా
అభ్యాసానికి ఆచార్యునిలా
ప్రశాంతతకి ప్రకృతివై
ఆనందానికి అందానివై
భాధాల్లో ఒదార్పువై
యువతీ యువకుల మనస్సులలో చేరి
దొబుచులాడినావు, రెండును ఒకటి చేసినావు
ప్రేమికులుగా కలిపినావు , ప్రణయ రాగం పాడినావు
ప్రేమవై నిలచినావు

Sunday, February 7, 2010

సంధ్యా సాగరం


సంధ్యా సమయం,సాగర విహారం
ఆకాశంలో సూర్యచంద్రుల గమనాగమనాలు
ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు
ఇసుక తిన్నెలు ,
ఆనంద సంద్రంలో అందరు
ప్రశాంత పందిరిలో మరికొందరు
సేధతిరే సాయంత్రం సమయాన .....

అరకు ప్రయాణం


విశాఖ మన్యం ,ఒక అరణ్యం
ప్రకృతి శోభకు నిలయం
విహంగాల ప్రణయం
ఘాట్ రోడ్ వలయం
అక్కడ లబించును స్వేచ్చ మారుతం
కటికి జలపాతం చల్లదనం
కాఫీ తోటల పచ్చదనం
గిరిజనుల జీవన చిత్రం
పూల తోటల పరిమళం
బొర్రా గుహల సోయగం
అరకు ప్రయాణం

Tuesday, February 2, 2010

గులాబీ


గుబురు గుబురు గా వుండి
అందరి గుండెలను దోచేది గులాబీ
మనోహరమైన ఆకృతితో
తనకు ఆకర్షితులను చేసేది గులాబీ
తన పరిమళాన్ని ప్రసరించి
ప్రణయ ప్రపంచాన్ని ఎలేది గులాబీ
రంగు రంగుల రూపాలలో
రమణి మనసును దోచేది గులాబీ
తన కాడాకున్న ముళ్ళని చూపి
మనల్ని అప్రమత్తం చేసేది గులాబీ