Monday, November 8, 2010

ఒంటరి

ఒంటరి ఒంటరి అనకు
ఎవరు లేరని అనకు
మరణం ధరి చేరేవరకు
మౌనం వీడవు ఎందుకు?
చుట్టూ మనుషులతో
ఒక్కసారి మాట్లాడి చూడు
మనసున్న మనుషులు తారసపడి
మమతను పంచేరు చూడు !!!!

Thursday, November 4, 2010

నేటి నరకాసురులు

నరకాసుర వధ చేస్తే మొదలయేను దీపావళి ,
అ వధ తాలుకు రక్తం నర నరమున చేరి పుట్టుకొచ్చే
నేటి నరరూప రాక్షషులు .
మనిషి అన్న మాట మరచి ,
మానవత్వం మంట కలిపి
మృగం తోలు కప్పుకుని
జన జీవన సఖ్యత చెరిపి
కుల,మత చిచ్చురేపే అధికారపు ఆహంకరం
ఆసిడ్ దాడులతో , అనుమానపు వైఖరితో
ధరణిపై కత్తులతో చేసే అమానుషం.

నిజమైన దీపావళి

ప్రతి ఒక్కరు ,ప్రతి క్షణము
ప్రశాంతంగా , ప్రశ్నలు లేని
ప్రమాదాలు దరిచేరని ,
ప్రజలు ఎవ్వరు భాధపడని,
ప్రపంచం అంతా సంతోషంతో ,
ప్రతి మోముపై కనిపించే ఆనందపు వెలుగులే
నిజమైన దీపావళి .....

దీపావళి శుభాకాంక్షలు

సంతోషపు వెలుగులో
ఆనందాల అరుగుపై
చెడును మంటచేసి
దాని జాడ చెరిపి వేసి
చీకటిని సాగనంపి
మంచిని ఆదరించి
మనిషిగా మసులుకొని
మానవత్వం పెంచుకొని
హాయిగా సంతోషంగా
వుండాలని కోరుకుంటూ!!!!
..... శ్రావ్యం

Friday, September 10, 2010

వినాయక చవితి శుభాకాంక్షలు



మూషిక వాహన మమ్ము కాపాడార
లంబోదర లౌక్యం నేర్పార
విజ్ఞేశ్వర విగ్నలను ఆపార
పార్వతి పుత్రా పాపులను పారద్రోలర
గణేశ మాకు గమ్యం చూపర
ఏక దంత వినాయక మాలో ఐక్యత నింపర
మమ్ము కాపాడి కరుణ చూపర .

జై బోలో గణేష్ మహారాజ్ కి జై

Wednesday, September 8, 2010

ఉరుకుల పరుగుల జీవితం

ఉరుకుల పరుగుల జీవితం
ఊపిరి సలపని ప్రయాణం
ప్రొద్దున లేస్తే జీవనం
సాగించాలి ఈ సమాజం
అడుగడున అపాయం
అయినా ఆగని పోరాటం

ప్రతి మనిషికి ఆశయం
నింపెను చాల ఉత్సాహం
ఆగదు కలం నీకోసం
ఆగవో చేరవునీగమ్యం

going going నేనింటికి వెళుతున్నాను

going going నేనింటికి వెళుతున్నాను
leaving leaving మై ఘర్ జారు ( में घर जारू )

బరా బరా బైకే తిసి
సరా సరా స్తార్టే చేసి ముందుకు పోతాను ..
I am Leaving.... నేనే going....

సంప్రదింపులు ,సలహాలు స్టేటస్ మీటింగు
testcase లు కోడింగు , రివ్యూ కామెంట్సు ...
ఇవన్ని లేని ,ప్రపంచం నాది ... అంటూ ..
""గోయింగ్ గోయింగ్ ""

దారిలో చాట్ బండి నన్నే పిలిచింది
పాణి పూరి తింటూ తింటూ ఎంజాయ్ చేయమంది
కాస్త ముందు ఇంకో చోట సమోసా బండుంది
వేడి వేడి సమోసా నన్ను ఊరిస్తున్దండి
ఎంజాయ్ చేసే సమయమిది అంటూ నేను
"గోయింగ్ గోయింగ్ "
మాదాపూర్ ,కావురిహిల్ల్స్,కమాన్ మాసాబ్ ట్యాంకు.
నాంపల్లి ,అబిట్సు, కోటి చాదర్ ఘాటు .
అడుగడుగున ట్రాఫిక్ జాము ఆగేను నా బైకు
ఆనందం వెతుకుతూ పోయే ప్రపంచం నాదంటూ
"గోయింగ్ గోయింగ్ "
దిల్ సుఖ్ నగర్ చౌరస్తా , దిల్ కుష్ చేసే రాస్తా
ఇంటికి కాస్త దూరంలోనే ఉన్నానన్న ఆశ ..
సేధతిరే సమయమోచ్చే నంటూ ....నేను
"గోయింగ్ గోయింగ్ "