ఆసిడ్ దాడులు , ఆకలి చావులు
ఇవన్ని లేని ప్రయాణం చేయాలనుకున్న
కాని !!!!!!!
అడుగడుగున అన్యాయం , అమాత్యుల అరాచకం
ప్రతి గల్లి ప్రాంతీయ వాదం, ఆపుచేసే పాటశాల చదువు
రాజకీయ దుమారం ,మారిన సమీకరణం
మండిన ఎండలు , మాడిన బ్రతుకులు
"జల్" తుఫాను తుడిచిపెట్టేను పంటపొలాలు
పెరిగిన ధరలు ,పెంచెను కష్టాలు
మారిన మంత్రిగనం, మల్లి మునిగినా పంటలు
పంట మిగలధాయే , రైతు చావు ఆగకపాయే
ప్రతి పార్టీ దీక్ష పూని , దీక్ష దక్షతను చెరిపే
ఈ రాజకీయ రణరంగం నేను (2010) వెళుతున్నా ఆగధాయే
ప్రశాంత జీవనాన్ని నేను (2010) మీకు ఇవ్వకపాయే ..
మీ
శ్రావ్యం (Sravan kumar Karnati)
