Thursday, March 10, 2011

ఉద్యమం ?

విజ్ఞత విజ్ఞానం మరచి విధ్వంసం సృష్టించే
పదకవితా పితామహుడి పాదాలు విరిచెను
విప్లవ కవి వెన్నువిరిచి , కందుకూరి గుండె చెరచి
తెలంగాణ పేరుతో ,తెలుగు ఖ్యాతి మంటకలిపి
రాయలు ,జాషువ మరి కొందరి మహామహుల
విగ్రహాలు విరిచి, చెల్లాచెదురు చేసెనే
ఉద్యమం పేరుతో ఉన్మాదం సృష్టించే
మీది ఒక పోరాటం ?
ఇదేనా ఉద్యమ మార్గం ?

Sunday, February 13, 2011

ప్రేమ


ప్రేమ,
రెండు అక్షరాలూ
కలిసుంటే తెలియవు క్షణాలు
విడిపోతే వీడవు జ్ఞాపకాలు
విలువిస్తే పెంచును బంధాలు
శ్రుతి మించితే తెచ్చును కష్టాలు
ప్రేమ,పెళ్లి అవుతుంది కలిస్తే కుటుంబాలు
అయ్యెను గంధరగోళం అడ్డుగా ఉంటె కులమతాలు.

ప్రేమిస్తే ?
మనసుతో మలచుకో ,
నీ మనసులోని మనసునే తెలుసుకో
మన్నించే గుణం పెంచుకో
మనసుని మనసుతో చేరి మనువే చేసుకో .....
.....................................................శ్రావ్యం.......

Thursday, January 13, 2011


సంక్రాంతి సంబరాలు , సంతోషాల సరదాలు
చెడును మసిచేసే భోగి మంటలు
కోనసీమ కోడి పందాలు
కనుల విందైన రంగ వల్లులు
ఆకాశాన్ని అలంకరించే గాలిపటాలు
కేరింతలలో తేలియాడే చిన్న పిల్లలు
అమ్మ చేసే రుచికరమైన పిండివంటలు
గంగిరెద్దుల సన్నాయి అడుగులు
అన్ని కలిసిన ఆనందపు జరులు
పల్లె పల్లె లో ప్రవహించాలని ....
........................... మీ
.......................... శ్రావ్యం (Sravan Kumar Karnati)

Thursday, January 6, 2011

నా లోని నరకయాతన !!!!!

నా ప్రాణమై నిలిచావు నన్నేల మరిచావు ?
నడి సంద్రంలో ముంచి నరకమే చూపావు
నా దేవత నీవని , నీ వాడిని నేనని
నీ ధ్యాసలో బ్రతుకుతూ నిలుచున్నా నీ కోసం
నలుదిక్కుల సాక్షిగా నన్ను ప్రేమించావు
దిక్కులేని వాడిని చేసి నీవెలా వెళ్లావు ?
నా కోసమే పుట్టావని ఆ నలుగురికి చెప్పాను
నన్నే మరచావని ఎవరికీ చెప్పాలి నేను
నా తోడు నీడవై, నా లోని ప్రేమవై
నా ప్రేమను విడిచి , నా రూపాన్ని మరచి
కనిపించని చోటికి నీ వెళ్లి పోయావు
నీ మాట వినిపించని దూరాన నిలుచున్నావు
నువ్వు వస్తావన్న ఆశని దూరం చేసావు.
......................................శ్రావ్యం

Tuesday, January 4, 2011

హేల్మెట్టు


హేల్మెట్టు హేల్మెట్టు
బైకే డ్రైవ్ లో నీ తలకు అదే కరెక్టు
ముఖము మురికి కాకుండా అరికట్టు హేల్మెట్టు
అందమైన హేల్మెట్టు అందరిని ఆకట్టు
కాగలదు నీ ప్రేమకు అదే తొలిమెట్టు
అందుకే ధరియించు నీవు ఇక చేయక బెట్టు.

Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏడాది గడిచింది , దశాబ్దం ముగిసింది
ఎన్నో మలుపులు , మరెన్నో తలపులు
మిగిల్చి పోతుంది , ముగిసి పోతుంది .
సరికొత్త శకం , మరికొన్ని గడియల్లో
మన ముందుకొచ్చి మొదలవ్వనుంది
పలుకుదాం స్వాగతం ,కలిసి మెలసి ఉందాం
అందరం ఒక్కటే అనే మాట చాటుదాం .

నూతన సంవత్సర శుభాకంక్షలతో ....
.................................శ్రావ్యం (Sravan Kumar Karnati)

Thursday, December 30, 2010

నేను ,2010

Software life
సాఫీగా సాగే జీవితం , సాంగత్యం లేక శోకించే
software సానుకూలంగా లేక శాంతి కరువాయే
facets fate మార్చే , నేను java మరచిపోయే
recession తగ్గి ,relax mode లో Rx లో చేరా
మల్లి java లో జాగింగ్ స్టార్ట్ చేసి ,
spring తో జంపింగ్ ప్లాన్ చేసి , వద్దుకే అనుకుని
pramotion కోసం వెయిట్ చేస్తూ
ప్రయాణం సాగిస్తూ, ప్రశాంతత వెతుకుతున్న ....

Social Service life
సాటి మనిషికి సహాయ పడాలని
స్నేహితులతో V2HelpU స్థాపించి
కొందరి మోములో ఐన సంతోషం చూడాలని
మేము చేసే ప్రయత్నం సంతోషకరం.

Personnel life::
వెంకు (నా మేనకోడలు ) , వేకువతోనే తన కేరింతలు
చిన్నమామ అనే పిలుపుతో రోజు ఆరంబించి
తన అల్లరితో,అలకతో పాన్పుపైకి చేరడం .
రిలీజ్ ఐన సినిమా కారణం లేకుండా చూస్తూ
రిలీఫ్ టీం లంచ్ లు , సాయంత్రం మిర్చి బజ్జిలతో
భాధలు సంతోషాల మేళవింపు తో ఎన్నో మలుపులు
తిరుగుతూ సాగుతున్న జీవితం నాది.