వేసవి ఎండకు మాడితిమి.....
పగలు ఎడుకే భానుడు భగ భగమని మండేనే,
బయటా అడుగు పెడితే మన భరతం పట్టెనే ,
ఎరులాగా సాగే నదులన్నీ ఎండనే,
బుక్కనీరు లేక బడుగు జీవి మాడనే ,
రేకులింట ఫానురెక్క తిరగనని ఆగితే ,
ఉక్కపోత తాళలేక పసిప్రనాం ఎడ్చనే,
సరిపోను కరెంటు ఇవ్వక సర్కారు చేతులేత్తితే ,
పనిలేక ,పనికాక కార్మిక కర్షకలు కంటనీరు పెట్టనే ,
ఒంటిలోని సత్తువంత ఇంత ఇంత ఆవిరయ్యే ,
శక్తిలేక , చేతకాక శ్రమజీవి నేల కూలనే.....
Sunday, May 15, 2011
Tuesday, May 10, 2011
ఓ మనిషి !!!
మనిషి ,
మని మని అంటూ తిరిగే మనిషి ,
పని కోసం పరుగులు తీసి....
చదువుకుని సారేయ్యేదోకడు
చదువు రాక సారూ అనేదోకడు
డబ్భు ఉండి దొరలాగా బ్రతికేదోకడు
ఆ డబ్భు కోసం దొర కాళ్ళు పట్టేదోకడు
పొట్టకూటి కోసం పరుగులు తీస్తూ ఉంటె
ఆ పొట్టలు కొడుతూ కోట్లు కూడా పెడుతూ
సాధించేదేముంది , సస్తే నీతో నడిచేదేది ?
అందుకే ..................
మనిషి , మనిహిగా బ్రతకాలి ,
నలుగురికి ప్రేమ పంచాలి
సాటి మనిషిని ఆదరించాలి
అది చూసి ,
అందరు నిన్నే పొగడాలి .........
మని మని అంటూ తిరిగే మనిషి ,
పని కోసం పరుగులు తీసి....
చదువుకుని సారేయ్యేదోకడు
చదువు రాక సారూ అనేదోకడు
డబ్భు ఉండి దొరలాగా బ్రతికేదోకడు
ఆ డబ్భు కోసం దొర కాళ్ళు పట్టేదోకడు
పొట్టకూటి కోసం పరుగులు తీస్తూ ఉంటె
ఆ పొట్టలు కొడుతూ కోట్లు కూడా పెడుతూ
సాధించేదేముంది , సస్తే నీతో నడిచేదేది ?
అందుకే ..................
మనిషి , మనిహిగా బ్రతకాలి ,
నలుగురికి ప్రేమ పంచాలి
సాటి మనిషిని ఆదరించాలి
అది చూసి ,
అందరు నిన్నే పొగడాలి .........
Sunday, May 8, 2011
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అనురాగం ఆప్యాయత కలిపితేనే అమ్మ.
కడుపులో దాచుకుని కాపాడేది అమ్మ.
'అమ్మ' అన్న పిలుపే అమృతం కన్నా చల్లన.
'కన్నా', 'నాన్నా' అని తను పిలిచే ప్రతి పిలుపు.
పరవశించి పోదా ,అది విన్న నీ మనసు.
నవమాసాలు మోసి , ఆటుపోట్లు అధిగమించి.
నడక నేర్పి , నవ్విస్తూ , కనిపెట్టుకు చూసి...
కంట్లో నలక పడితే , కన్నీరు రాల్చే పిచ్చిది అమ్మ.
అమ్మ కరుణ వుంటే చాలు , అమ్మ చేతి వంట మేలు.
అమ్మే లేకుంటే ప్రతిజీవి మనుగడకి లేదోయి ఆరంభం.
Monday, May 2, 2011
తొలిసారిగా
తొలిసారిగా నిన్నే నేను చూసాను నాడు,
ఆ క్షణమే మదిలో న్లిపా నీ రూపాన్ని నేను ,
కావాలని అనుకున్నా ఇంకేదో నీకు ,
అనుకోగానే పడిపోయా నీ మైకంలో నేను ,
ఐ లవ్ యు అన్న పదమే గుర్తుకు రాలేదు ఆనాడు ,
చెప్పాలనుకున్న నా దారిలో లేవే ఈనాడు ....
ఆ క్షణమే మదిలో న్లిపా నీ రూపాన్ని నేను ,
కావాలని అనుకున్నా ఇంకేదో నీకు ,
అనుకోగానే పడిపోయా నీ మైకంలో నేను ,
ఐ లవ్ యు అన్న పదమే గుర్తుకు రాలేదు ఆనాడు ,
చెప్పాలనుకున్న నా దారిలో లేవే ఈనాడు ....
Wednesday, April 13, 2011
Girls be alert while ride on bikes
బైకు పైన పోతుంది అమ్మాయి
బాయ్ ఫ్రెండ్ తో నొక్కింది సన్నాయి
జాలువారే తన ఎద దాచే కవచము(చున్ని)
నాకు గుబులు రేపే దాన్ని తాకుతూ బైకు చక్రము
హలో హలో అని అరిచినా, సోయా లేని అమ్మాయి
చున్ని చక్రంలో చిక్కుకుని క్రిందపడే పాపము .
బాయ్ ఫ్రెండ్ తో నొక్కింది సన్నాయి
జాలువారే తన ఎద దాచే కవచము(చున్ని)
నాకు గుబులు రేపే దాన్ని తాకుతూ బైకు చక్రము
హలో హలో అని అరిచినా, సోయా లేని అమ్మాయి
చున్ని చక్రంలో చిక్కుకుని క్రిందపడే పాపము .
Monday, April 11, 2011

శ్రీ రామ! శ్రీ రామ! శ్రీ రామ! శ్రీ రామ!,
శ్రీ రామ అన్న పదమే విన్నాను ,
రామ రాజ్యం చూడాలని కల కన్నాను,
అవినీతి మహమ్మారి పురులు ఇప్పుతుంటే,
అనాగరికత అవధులు దాటుతుంటే,
రాముడి పేరుతో రాజకీయం ఒక వైపు,
రావణుడిని మరిపించే రాక్షసులు మరువైపు,
ఈ రాక్షస సంహారం చేసే రాముడు ఎక్కడున్నాడు ?,
అవినీతిని అర్పేసే అభిరాముడు ఏమయ్యాడు ? ,
ప్రతి మనిషి తలచుకుంటే అవినీతిని ఆర్పగలరు,
కళలు కనే రామ రాజ్యం కనులార చూడగలరు !!!
Subscribe to:
Posts (Atom)