Friday, July 13, 2012

మనిషి అన్న విషయం మరచి,
మృగపు చాయాలు బైట పరచి,
సాటి జనం పై విరుచుకు పడి
మానవత్వం మంటకలిపెను,
సాటి జనం మాకేమని చిత్రం చూసిన వేళ,
సబ్య సామజం తలదించుకునే అకృత్యం జరిగిపాయే,
సర్కారు నిద్రచూసి, ప్రతిసందులో కాపు కాసి ,
పశువోలె పడుచులపై పందులోలె పడుతున్న సిగ్గులేని మృగలెన్నో,
మానవాళి మడుగను ప్రశ్నార్ధకం చేసే ప్రశ్నలెన్నో, పరిస్థితులెన్నో,
ఈ అకృత్యాలు ఆగేదేలగానో, మనిషి ప్రశాంత జీవన చిత్రాన్ని చుసేదేప్పుడో.
దేవుడా !!!  అందరికి మంచి మనస్సు ఇచ్చి మనుషులను చేయు మంచిని కాపాడు.

Friday, January 13, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి సంబరాలు ప్రతి ఇంటా మొదలయేను ,
ఆప్యాయుల ఆగమనం , ఆదరించే అభిమానం,
ఆటలతో, పాటలతో ప్రతి ఇల్లు అయ్యెను ఆటస్థలం ,
కొత్తశకం తెరతిసి , పాతనంత మంటచేసి ,
భోగిమంట వెలుగులా, వెలగాలి మన జీవితం ,
గాలిపటాల సమూహం ఆకసాన హరివిల్లు కాగ ,
డుడు బసవన్న ,సన్నాయి చప్పుళ్ళు
సందు సందున వినిపించగా ,
కోడి పందేలు, పిల్లల కేరింతలతో ,
సంక్రాంతి సంబరాలు మిన్నంటేనే .........

Thursday, January 12, 2012

National Youth Day


వెలిగించు జ్యోతిని , నీ ఎదలోని జ్వాలతో ,

నడిపించు భారతాన్ని , నీ యువత స్పూర్తితో ,

బలమే నీ ఆయుధమై , ధైర్యం నీ ఊపిరిగా ,

సాహసంతో పోరాడి , సాధించు అనుకున్నది,

మానవతా దృక్పథం నరనరాన పారించి ,

సాటి మనిషి శ్రేయస్శుకు పాటుపడు ఓ మనిషి ,

ఔదార్యం , ఔన్నత్యం మనం ధరించే ఆభరణం ,

పెంచుకుంటూ పోతే పెరుగును మన ఐశ్వర్యం ,

"కష్టేఫలి" అన్న నానుడి నువ్వు తెలుసుకుని ,

ఇష్టంతో ప్రయత్నిస్తే అనుకున్నది దొరుకుతుంది,

మన యువత కావలి జాతి గర్వించేలా ,

వేలకొలది వివేకులు రావాలి ప్రతి ఇంటా .....

Wednesday, December 28, 2011

రాయి రాయి పేర్చితే, నిడనిచ్చు గూడు ,
అదే రాయి విసిరితే, రక్తమొచ్చు చూడు,
రక్త ధారా పారించి, సాధించేది ఏముంది ?
చరిత్రంత చదివిన, నువ్వు, నేర్చుకున్నదేముంది?
ప్రేమించే గుణముంటే, పదిమంది మనవెంటే,
ప్రేమించని మనసుకి క్షణ క్షణం చికాకే.
మన చుట్టూ కనపడే ప్రతి ప్రాణినీ క్షేమంగా,
చూసుకునే భాద్యత, నీదే కదా సోదరా.

Monday, December 26, 2011

Feelings of 2011

సరికొత్త ఆశలతో వచ్చాను మీ ముందుకు,
తారీకులు మారుతున్న, మారని తలరాతలు,
పెరుగుతున్న ధరలతో పెరిగిపోయే పేదరికం,
అడుగడుగున అవీనితి, కోట్లకొలది కుంభకోణం ,
కాలం కాటేసి , కటకటాల పాలు చేసే.
ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని అన్నా,
తమ వారికి వద్దన్న మన దేశ పెద్దన్న(ప్రధాని),

ప్రాంతీయ విబేధాలు, సమ్మెలు , గొడవలు,
ప్రతిక్షణం మారిన రాజకీయ రంగులు,
పండించిన ధాన్యం రైతు నోరు చేరధాయే,
మనం చేసే తప్పుకి, ప్రకృతి పగ పట్టి,
త్రాగటానికి చుక్క నిరు లేక నిరసించే ప్రతి jeevi ,
సంతోషం పంచలేక ప్రయాణం ముగించా,
సరికొత్త సంవత్సరం అందరికి సంతోషాలని పంచాలని,
నూతన సంవత్సర శుభాకాంక్షలతో , మీ 2011.....

Sunday, September 4, 2011

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు


ఉషోదయపు వెలుగులో ప్రసరించిన కిరణాలై,
విద్యార్థుల మనస్సులో జ్ఞానజ్యోతి వెలిగించి,
అహర్నిశలు శ్రమించి, మమ్ము ప్రయోజకులను చేసిన,
ఉపాధ్యాయ లోకానికి , విద్యార్థి ప్రపంచం సమర్పించే,
ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షల మాలిక .......