Friday, September 10, 2010

వినాయక చవితి శుభాకాంక్షలు



మూషిక వాహన మమ్ము కాపాడార
లంబోదర లౌక్యం నేర్పార
విజ్ఞేశ్వర విగ్నలను ఆపార
పార్వతి పుత్రా పాపులను పారద్రోలర
గణేశ మాకు గమ్యం చూపర
ఏక దంత వినాయక మాలో ఐక్యత నింపర
మమ్ము కాపాడి కరుణ చూపర .

జై బోలో గణేష్ మహారాజ్ కి జై

Wednesday, September 8, 2010

ఉరుకుల పరుగుల జీవితం

ఉరుకుల పరుగుల జీవితం
ఊపిరి సలపని ప్రయాణం
ప్రొద్దున లేస్తే జీవనం
సాగించాలి ఈ సమాజం
అడుగడున అపాయం
అయినా ఆగని పోరాటం

ప్రతి మనిషికి ఆశయం
నింపెను చాల ఉత్సాహం
ఆగదు కలం నీకోసం
ఆగవో చేరవునీగమ్యం

going going నేనింటికి వెళుతున్నాను

going going నేనింటికి వెళుతున్నాను
leaving leaving మై ఘర్ జారు ( में घर जारू )

బరా బరా బైకే తిసి
సరా సరా స్తార్టే చేసి ముందుకు పోతాను ..
I am Leaving.... నేనే going....

సంప్రదింపులు ,సలహాలు స్టేటస్ మీటింగు
testcase లు కోడింగు , రివ్యూ కామెంట్సు ...
ఇవన్ని లేని ,ప్రపంచం నాది ... అంటూ ..
""గోయింగ్ గోయింగ్ ""

దారిలో చాట్ బండి నన్నే పిలిచింది
పాణి పూరి తింటూ తింటూ ఎంజాయ్ చేయమంది
కాస్త ముందు ఇంకో చోట సమోసా బండుంది
వేడి వేడి సమోసా నన్ను ఊరిస్తున్దండి
ఎంజాయ్ చేసే సమయమిది అంటూ నేను
"గోయింగ్ గోయింగ్ "
మాదాపూర్ ,కావురిహిల్ల్స్,కమాన్ మాసాబ్ ట్యాంకు.
నాంపల్లి ,అబిట్సు, కోటి చాదర్ ఘాటు .
అడుగడుగున ట్రాఫిక్ జాము ఆగేను నా బైకు
ఆనందం వెతుకుతూ పోయే ప్రపంచం నాదంటూ
"గోయింగ్ గోయింగ్ "
దిల్ సుఖ్ నగర్ చౌరస్తా , దిల్ కుష్ చేసే రాస్తా
ఇంటికి కాస్త దూరంలోనే ఉన్నానన్న ఆశ ..
సేధతిరే సమయమోచ్చే నంటూ ....నేను
"గోయింగ్ గోయింగ్ "

Saturday, September 4, 2010

బస్సు లో భామా

మనసు సేదకోరి కనులు మూసే ఆ పడుచు
ఆకాశం నుండి జాలువారిన దరులా!
అనిపించే ఆ భామిని కురులు .
అరమోడుపు కనులతో ప్రశాంత లోకంలో
ఉన్న ఆ కాంత ముంగురులు కప్పివేసే తన నయనాలను
ఏదో అలజడి వొచ్చేనా అన్నట్లు
అదిరే ఆ అమ్మాయి అధరాలు
ఇంతలో తనని పలకరించిన సెల్ పోన్ లో
ఆనందమయ హృదయంతో సంభాషించే ఆ సంధ్యా
సంభాషణ అనంతరం మల్లి స్వేచ్చ
లోకానికి పరుగులు తీసే తన నయనాలు
చివరకు ..............
తన గూడు చూసిన గువ్వలా
గమ్యం చేరే గాబరలో
వడివడిగా బస్సుదిగెను ఆ భామామణి .

నమ్మవా నా ప్రేమని ?

నిను చూసిన క్షణాన గుండెలో అలజడి
నను వీడి వెళ్ళిన క్షణాన ఆ అలజడి
అలలుగా మారి కన్నీరు అయినది
కన్నీరుకు విలువలేని కలికాలం లో
కనిపించని ప్రేమని ఎలా చూపేది
మనసులోని భాదను ఎలా బయటపెట్టేది
బ్రతుకంత నాతోనే అన్న నీవె
బ్రతిమాలిన నా ప్రేమ నమ్మవా?

Monday, August 23, 2010

రక్షా భంధన్


రక్ష రక్ష రక్ష , ఇది రాఖి రక్ష
అనుభంధపు , ఆత్మీయత నీడలో
ఆడపడుచును అనుక్షణం కాపాడే రక్ష
తోబుట్టువు తోడుగా ఉండే రక్ష
చిట్టి చెల్లి ఆటలో , తను బడికి వెళ్ళే బాటలో
అనుక్షణం అండగా ఉంటానని అన్నదమ్ములు చేసే ప్రతిజ్ఞ
--- శ్రావ్యం (sravan kumar K)