
మొదటి గడియలు మూడు మనసుల గ్రీటింగ్స్,
వేకువ జామున చేసాను గుడిచుట్టు రౌండ్స్ ,
మా వెంకు చూస్తుందని దాచేస చాక్లెట్స్ ,
అందరికి ఇవ్వటానికి తీసుకున్న స్వీట్స్ ,
మధ్యలో లిఫ్ట్ చేశా ఇంకంమింగ్ కాల్స్ ,
ఫ్రెండ్స్ తో కానిచ్చ ఈవెనింగ్ చాట్స్,
రోజులో కట్ చేశా ముచ్చటగా త్రీ కేక్స్ ,
ప్రతి గడియ పెంచింది రోజులో హై లైట్స్ .
మొదటి గడియలు మూడు మనసులా ముచ్చట్లు,
వేకువ జాము గడియలు
మనసులోని భావాలకు అక్షర మాలిక ,
సౌందర్య విశ్లేషణ నీతోనే తేలిక ....
మొదలెట్టా నీతో ప్రయాణం , ఒక కల్పనగా ,
దాచేసా మిమ్మల్ని బ్లాగులో భద్రంగా ....
మనసుతో చూసాను ప్రకృతిలో ప్రతి అందాన్ని ,
పరవశించి రాసాను దానిలోని భావాన్ని ....
కన్నులతో చూసాను కల్తి సమాజాన్ని,
కలంతో తెలిపాను అక్షర సత్యాన్ని ....
రాగల పల్లకిలో కోయిలమ్మ ...
కుహు కుహు అంటుంది పాటలమ్మ...
రూపేమో నలుపు ,
మనసు మనతో కలుపు,
పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ,
తన పాటనే వినిపించి పరవశింప చేస్తుంది ....
ఆకాశాన విహారి ,
చెట్టే తన జాగిరి ,
కుహు కుహు అంటూనే ,కూనిరాగాలు తీస్తుంది ...
కవుల పాటకు ప్రతిమ ,
స్వరసంపదే తన విలువ ,
కలిసి పాడమంటూ సవాలే విసిరింది .
తనతో, కలిసి పాడమంటూ సవాలే విసిరింది,