Thursday, January 6, 2011

నా లోని నరకయాతన !!!!!

నా ప్రాణమై నిలిచావు నన్నేల మరిచావు ?
నడి సంద్రంలో ముంచి నరకమే చూపావు
నా దేవత నీవని , నీ వాడిని నేనని
నీ ధ్యాసలో బ్రతుకుతూ నిలుచున్నా నీ కోసం
నలుదిక్కుల సాక్షిగా నన్ను ప్రేమించావు
దిక్కులేని వాడిని చేసి నీవెలా వెళ్లావు ?
నా కోసమే పుట్టావని ఆ నలుగురికి చెప్పాను
నన్నే మరచావని ఎవరికీ చెప్పాలి నేను
నా తోడు నీడవై, నా లోని ప్రేమవై
నా ప్రేమను విడిచి , నా రూపాన్ని మరచి
కనిపించని చోటికి నీ వెళ్లి పోయావు
నీ మాట వినిపించని దూరాన నిలుచున్నావు
నువ్వు వస్తావన్న ఆశని దూరం చేసావు.
......................................శ్రావ్యం

2 comments: