Sunday, May 15, 2011

వేసవి వెన్నెల చల్లదనం

వేసవి వెన్నెల చల్లదనం ,
మరిపించును పగటి వెచ్చదనం.,
'సారి ' అన్న అక్షర ద్వయం,
పోగొట్టును ఇదరి విరోధం .
ఆకాశం రాల్చు వర్షం ,
జరులై పారును అనంతరం.
నచ్చిన వ్యక్తితో రాజి పడటం ,
కలుపును మనుషుల కలకాలం.
మనసుతో పెంచే ప్రేమ వనం ,
మరణం చెందదు జీవితాంతం.
పెరుగుతూ పోతే అవినీతి జనం ,
సంతోషం ఉండదు కలకాలం .
పదిమంది మెచ్చే మంచితనం,
మరువరు ఎవ్వరు క్షణకాలం .

No comments:

Post a Comment