కులం మతం అంటూ కుళ్ళు రాజకీయాలు,
తమ లబ్ధి కోసం కుమ్ములాట సృష్టించే,
అడుగడుగునా అవినీతి ఆకాశాన్ని తాకగా,
ఆమాత్యులు మాకేమని అలసత్వం చూపగా,
యువత ఓపిక కోల్పోయి యుద్ధం ప్రకటిస్తే,
కాకీల నీడలో మనం కాలం గడపగా ,
ప్రకృతి కోపంతో కరువు తాండవించగా,
త్రాగనికి నీరు లేక బడుగు జీవి ఎండిపోయే,
వరదలు ముంచెత్తి వరిగింజ కరువాయె,
చలితీవ్రత పెరిగి , జనమంతా వనికిపోయే,
నిర్బయ పై నీచుల కీచక పర్వం ,
సిగ్గుతో తలదించుకున్న భారత జనం ,
తేదీలు మారిన , విజ్ఞానం పెరిగిన,
మనిషి గతి మార్చలేక , ముగిస్తున్న నా ప్రయాణం .
ఇట్లు
మీ 2012
correct anna.....
ReplyDelete