Thursday, August 8, 2013

చిన్ననాటి కలవా

చిన్ననాటి కలవా, చిగురించిన ఆశవా ,

చెరిగిపోని గురుతువా,మరువలేని జ్ఞాపకమా ,

కనులతోనే సంభాషించే కమనీయ రూపమా,

నడకతోనే నను కట్టేసే నాట్య మయురివా,

అనుక్షణం నను కవ్వించే అపురూప కల్పనవా,

అడుగడుగునా నా తోడుండే అరుదైన మిత్రమా.

No comments:

Post a Comment