ఆకాశం నుండి జాలువారిన దరులా!
అనిపించే ఆ భామిని కురులు .
అరమోడుపు కనులతో ప్రశాంత లోకంలో
ఉన్న ఆ కాంత ముంగురులు కప్పివేసే తన నయనాలను
ఏదో అలజడి వొచ్చేనా అన్నట్లు
అదిరే ఆ అమ్మాయి అధరాలు
ఇంతలో తనని పలకరించిన సెల్ పోన్ లో
ఆనందమయ హృదయంతో సంభాషించే ఆ సంధ్యా
సంభాషణ అనంతరం మల్లి స్వేచ్చ
లోకానికి పరుగులు తీసే తన నయనాలు
చివరకు ..............
తన గూడు చూసిన గువ్వలా
గమ్యం చేరే గాబరలో
వడివడిగా బస్సుదిగెను ఆ భామామణి .

