Monday, June 28, 2010

చక్కని నేస్తం మన చందమామ !!!!!!

మామ చందమామ
నిన్ను తొలిసారి చూసాను మామ . !!2!!

నా చిన్నప్పుడు అమ్మే నీ గురించి చెప్పెను
నీ చల్లని నీడలో కథలెన్నో నాకు నేర్పెను !!2!!

చంటిపాపనైన నాకు చక్కని నేస్తమని ,
సరదాలు తీర్చే ఆటబోమ్మవని ,
కవులకు కవితవని , పాటకు పల్లవని
చంటి పాప బోసినవ్వు నీవు అని....
!! నా చిన్నప్పుడు !!
భూమికి చుట్టమని , తన చుట్టూ ఉంటావని
సాయంత్రం చల్లని నీడవని.....
అమావాస్య చికటని, అసలే రావుఅని
ఆడుకునే నేస్తం నేడు రాడు అని.
!! నా చిన్నప్పుడు !!

No comments:

Post a Comment