Monday, December 31, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!

గడియ గడియకు మారును గడియారపు గంటలు,
దాచుకుంటే దాగిపోవు హృదయంలో ప్రతి జ్ఞాపకం.
మంచిని దాచుకుని , చెడుని వదులుకుని,
తప్పుని తరిమి కొట్టి, తడబాటుని అధిగమించి,
విజ్ఞత విలువపెంచి, విజయుడవై  నువ్వు నిలిచి,
మానవత్వపు మాలని మనసులో ధరించి ,
సాటి వారిని ప్రేమించి, సమాజ హితం కోరి,
పరిశుభ్రత పాటించి, పచ్చధనం పెంచేసి,
శక్తిని నిలువ చేసి,  ప్రతిశక్తిగా నువ్వు మారి,
రాబోవు తరానికి మార్గదర్శిగా నువ్వు మారి,
సరికొత్త ప్రపంచానికి సైనికుడివి అవ్వాలని 
కోరుకుంటూ ....
నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!
 

నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!


గడియ గడియకు మారును గడియారపు గంటలు,
దాచుకుంటే దాగిపోవు హృదయంలో ప్రతి జ్ఞాపకం.
మంచిని దాచుకుని , చెడుని వదులుకుని,
తప్పుని తరిమి కొట్టి, తడబాటుని అధిగమించి,
విజ్ఞత విలువపెంచి, విజయుడవై  నువ్వు నిలిచి,
మానవత్వపు మాలని మనసులో ధరించి ,
సాటి వారిని ప్రేమించి, సమాజ హితం కోరి,
పరిశుభ్రత పాటించి, పచ్చధనం పెంచేసి,
శక్తిని నిలువ చేసి,  ప్రతిశక్తిగా నువ్వు మారి,
రాబోవు తరానికి మార్గదర్శిగా నువ్వు మారి,
సరికొత్త ప్రపంచానికి సైనికుడివి అవ్వాలని 
కోరుకుంటూ ....
నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!

Feelings of 2012

కులం మతం  అంటూ కుళ్ళు రాజకీయాలు,
తమ లబ్ధి కోసం కుమ్ములాట సృష్టించే,
అడుగడుగునా అవినీతి ఆకాశాన్ని తాకగా,
ఆమాత్యులు మాకేమని అలసత్వం చూపగా,
యువత ఓపిక కోల్పోయి యుద్ధం ప్రకటిస్తే,
కాకీల  నీడలో  మనం  కాలం గడపగా ,
ప్రకృతి కోపంతో కరువు తాండవించగా,
త్రాగనికి నీరు  లేక బడుగు జీవి ఎండిపోయే,
వరదలు ముంచెత్తి వరిగింజ కరువాయె,
చలితీవ్రత పెరిగి , జనమంతా వనికిపోయే,
నిర్బయ పై నీచుల కీచక పర్వం ,
సిగ్గుతో తలదించుకున్న భారత  జనం ,
తేదీలు మారిన , విజ్ఞానం పెరిగిన,
మనిషి గతి మార్చలేక , ముగిస్తున్న నా ప్రయాణం .
ఇట్లు
మీ  2012

Sunday, October 28, 2012

నిను చేరెను నీ  గమ్యం,
ధడిచావో  అది నిను విడువున్,
తొలగించు నీ భయం,
సాధించు నీ లక్ష్యం,
వృధా చేయకు నీ కష్టం,
ఎగురవేయు విజయ పతాకం. 

Sunday, October 14, 2012

గాలి గాలి కనపడనీ గాలి

గాలి గాలి కనపడనీ గాలి,
వీచి వీఛి మా ఆయువు పోసి,
నీరే లేక పొడిగా నువు మారి ,
వేడే పెరిగి మము కాల్చు గాలి,
కోపం వస్తే సుడిగాలి నువ్వు అయ్యి,
ఊరంతటిని ఊడ్చేసే గాలి,
చలి కాలం రా రా అనగానే ,
వెంటనే వచ్చి వనికించు గాలి,
గాలి గాలి కనపడని గాలి,
వీచి వీచి మా ఆయువు పోసి .......

Monday, October 1, 2012

వర్షపు చుక్క లేక భూమేమో ఎండిపోయే ,
వానమ్మ కరునించక చెట్టేమో మాడిపోయే,
పొట్ట చేత పట్టుకుని రైతన్న పట్నం వస్తే,
పంట చేను దిక్కులేక భీడుగా మారిపోయే,
కూలి నాలి చేసీ కండలన్నీ కరిగిపోయే,
తిండి గింజ రేటు మాత్రం ఆకశానా ఉండిపోయే,
నదులన్నీ ఇంకిపోయి ఆనకట్ట తెరువరాయే,
చుక్కనీరు లేక, డెల్టా దిగుబడి పడిపోయే,
చూసే వారు లేక ఊరే ఎడారి ఆయే,
పచ్చని చెట్టు నీడ చందమామ చంధమాయే ....

Sunday, September 30, 2012

దేవదాసు నేనైపోత ప్రేయసి నీకోసం 
అన్న పానీయం ముట్ట నీ జాడ కోసం 

నిన్నే ప్రేమించానులే , మదిలో నీ రూపే దాచానే 
చెంతకు  చేరి , ఒట్టే వేసి , మాటే ఇస్తాలే   !! దేవదాసు !!

భూగోళం పేలిన , సునామి వచ్చే ముంచిన 
నీ చేయే విడవను దూరం చేయను మాటే ఇస్తాలే   !! దేవదాసు !!

అమ్మనాన్న అడ్డొచ్చినా , ఇంకెవడో నన్నే ఆపీన 
వాళ్ళను పక్కనే పెట్టి  పసిపాపల్లె నిన్నే  చూసుకుంటాలే  !! దేవదాసు !!

మనస్పర్ధలె వచ్చిన , అనుమానపు భూతం పట్టినా 
నువ్వే ము ముఖ్యం అంటూ వాటిని మూట కట్టివేస్తలే  !! దేవదాసు !!