సందెవేళ సరసాలకు నిలయాలు పార్కులు
ఆదమరచి నిదురించేరు కొందఱు మూర్కులు
కాలక్షేపానికి వచ్చారు మరికొందరు వృద్ధులు
పిల్లాపాపల బంతాటలకు నిలయాలు పార్కులు
యువతీ యువకులకు కాలక్షేప ప్రదేశాలు
కొత్త దంపతులకు సరదాల సంధర్శనాలయాలు
శ్రమ జీవులకు ప్రశాంత నిలయాలు
ప్రజల ఒత్తిడుల జీవితాలకి ఆహ్లాదాన్ని ఇచ్చే ఆలయాలు మన పార్కులు
No comments:
Post a Comment