చెప్పాలని అనుకున్నా చిన్ననాటి నేస్తమా ,
నీ అడుగులని అనుసరించనా విడలేని బంధమా ,
గుప్పెడంత గుండెలోనా ఉప్పెనల్లె ప్రేమ దాచ
చెప్పలేక నిలుచున్న , చెప్పాలని అనుకున్నా,
అమావాస్య చంధమామలాగా కనపడని నా ప్రేమ ,
శూన్యంలో మాటలాగా వినపడదు నా గాథ ,
ప్రేమనంత మూటగట్టి మనసులోనే దాచాను
మౌనమే నా స్నేహం అంటూ మాటలాడుతున్నాను.
Thursday, June 9, 2011
Wednesday, June 8, 2011
స్మశానం
అందరు వున్న , అనాధవైన అక్కున చేర్చేది ,
తనువును తనలో దాచి , ఆత్మని వదిలేది ,
మరణించిన వారి అంతిమ గమ్యం ,
విరోధం అసలే కనపడని విశ్రాంతి నిలయం ,
కుల, మత , గోత్రం అడ్డురాని దేవాలయం ,
ఆదమరచి నిదురించే ఆశ్రయం,
ఎన్నికల గొడవ అసలే లేని ఎముకల గుడారం ,
ఆస్తి తగాదాలు కానరాని అస్తికల నిలయం ,
అందం ,చందం , ఆభరణం అక్కరలేని అస్థిపంజరం
అడుగడుగున కనపడుతూ సృష్టించే మనలో భయం.
తనువును తనలో దాచి , ఆత్మని వదిలేది ,
మరణించిన వారి అంతిమ గమ్యం ,
విరోధం అసలే కనపడని విశ్రాంతి నిలయం ,
కుల, మత , గోత్రం అడ్డురాని దేవాలయం ,
ఆదమరచి నిదురించే ఆశ్రయం,
ఎన్నికల గొడవ అసలే లేని ఎముకల గుడారం ,
ఆస్తి తగాదాలు కానరాని అస్తికల నిలయం ,
అందం ,చందం , ఆభరణం అక్కరలేని అస్థిపంజరం
అడుగడుగున కనపడుతూ సృష్టించే మనలో భయం.
మేఘం!!!
ఉరిమి ఉరిమి వాన తానై ఉరకలేసే మేఘం
మబ్బు తానై మండుటెండలో గొడుగు తానై మేఘం ,
వాన నీటిని తనలో దాచి తుదకు కరిగే మేఘం ,
పంటపొలాలకు ప్రాణం మిచ్చే నీటి చుక్క స్థావరం ,
చుక్క చుక్క రాల్చి తాను చిక్కిపోయే మేఘం ,
ఈదురు గాలిలో ఈదుకుంటూ తిరిగి తిరిగి మేఘం ,
వాన నీటిని భువిపై వదిలి నింగికెగసే మేఘం ..

ఒక అమ్మాయి బస్సు ప్రయాణం !!!
అర తెరచిన కన్నులతో అల చూస్తున్నావు,
బస్సులో కిటికీ నుండి కనపడే అందాలను విక్షించావు,
కంటి మీద కునుకు వున్న కనులు మూయవెందుకు ?
కనిపించే వింతలు అని దాచే అందుకా !!
దారిలో దేవుడు కనపడితే దణ్ణం పెట్టావు
బైకు పై వెళ్ళే పోకిరి గాళ్ళను ఛీ కొట్టావు ,
అమ్మ భుజంపై చంటిపాపను పలకరించావు ,
అందమైన అబ్బాయిలను ఓరగా చూసావు ,
గాలికి ఎగిరిన కురులను కంటికి అడ్డుగా తీసావు ,
కంటికి నచ్చిన ప్రతి అందాన్ని ఆస్వాధించావు,
మదిలో మెదిలిన ఆలోచనలను ఆద్యం పోసావు ,
దారి పొడుగునా దరహాసంతో దరికే చేరావు.

Tuesday, May 31, 2011
అమ్మాయి ......
అమ్మ ఒడిలో పెరిగి, నాన్న కరుణ రుచి చూసి,
అన్నదమ్ముల అభిమానంలో మునిగి,
ఆరుబయట ఆడుకున్న ఆటలు ఎన్నో,
తోటివారితో పాడుకున్న పాటలు ఎన్నో,
రోజులు తిరిగి తిరిగి, నెలలన్నీ కరిగి,
పెళ్లి ముహూర్తం వచ్చెనమ్మ, కొత్త జీవితం ఇచ్చునమ్మ,
పెళ్లి పందిరి ,అదిగో పెళ్లి పందిరి ,
ఎన్నో ఆశల లోగిలి, కొత్త జీవితపు వాకిలి ,
ముహూర్త సమయం వచ్చనే , మూడు ముళ్ళు వేసేనే,
ముచ్చటగా వరుడు ముంగిట నిలిచి , కొత్త జీవితం యిచ్చునే,
తలంబ్రాల తాళాలు , చప్పుడు చేసే మేళాలు ,
దైవదూతల అనిపిస్తూ దీవించే ఆత్మీయులు,
అంపకాలు , పంపకాలు , నూతన వధువు అప్పగింతలు ,
అమ్మైనా , నాన్నైనా , అభిమానించే అన్నదమ్ములైన ..
అన్ని మిరే అంటూ , సర్వస్వం మీరంటు ,
పెల్లికుతురిని అప్పగించే అప్పగింతలు ,
సంతోష సమయాన ఏడుపు తెచ్చే అప్పగింతలు.

Friday, May 27, 2011
జీవితం
జీవితం , జీవం సాగించే ప్రయాణం ,
ఎన్నో ఆటుపోట్ల సమూహం ,
తొలి అడుగు అమ్మ కడుపులో
మళి అడుగు ఎవరి చెంతనో
చిన్ననాటి ప్రాయం చింతలు లేని ప్రాయం
చింత చెట్టులా కాగానే చికాకులే తన స్థావరం
దారిపొడుగునా దరహాసం , దారిద్ర్యం
అడుగడుగునా ఆనందం , అపోహలు
భాగ్యాలు భోగాలు భాదాలు భరించటాలు
నష్టాలు , కష్టాలు , లాభాలు లంచాలు
చిరునవ్వులు చీదరింపులు , చివాట్లు చెప్పుదెబ్బలు...

రాత్రి
రేపు అనే ధ్యాసతో , బ్రతుకు మీద ఆశతో
నేడు ఒక పాటంగా , రేపటి గునపాటంగా
చింతలన్ని వీదమంటూ , చీకటిని పిలుస్తుంది
మనసులోని భాదాలన్ని బయటకి పంపిస్తుంది
చికతింత అడుగుడి , వేకువనే వెళుతుంది.
నేడు ఒక పాటంగా , రేపటి గునపాటంగా
చింతలన్ని వీదమంటూ , చీకటిని పిలుస్తుంది
మనసులోని భాదాలన్ని బయటకి పంపిస్తుంది
చికతింత అడుగుడి , వేకువనే వెళుతుంది.
Subscribe to:
Posts (Atom)