చెప్పాలని అనుకున్నా చిన్ననాటి నేస్తమా ,
నీ అడుగులని అనుసరించనా విడలేని బంధమా ,
గుప్పెడంత గుండెలోనా ఉప్పెనల్లె ప్రేమ దాచ
చెప్పలేక నిలుచున్న , చెప్పాలని అనుకున్నా,
అమావాస్య చంధమామలాగా కనపడని నా ప్రేమ ,
శూన్యంలో మాటలాగా వినపడదు నా గాథ ,
ప్రేమనంత మూటగట్టి మనసులోనే దాచాను
మౌనమే నా స్నేహం అంటూ మాటలాడుతున్నాను.
No comments:
Post a Comment