Wednesday, June 8, 2011

మేఘం!!!

ఉరిమి ఉరిమి వాన తానై ఉరకలేసే మేఘం
మబ్బు తానై మండుటెండలో గొడుగు తానై మేఘం ,
వాన నీటిని తనలో దాచి తుదకు కరిగే మేఘం ,
పంటపొలాలకు ప్రాణం మిచ్చే నీటి చుక్క స్థావరం ,
చుక్క చుక్క రాల్చి తాను చిక్కిపోయే మేఘం ,
ఈదురు గాలిలో ఈదుకుంటూ తిరిగి తిరిగి మేఘం ,
వాన నీటిని భువిపై వదిలి నింగికెగసే మేఘం ..

No comments:

Post a Comment