కన్నులలో నీ రూపమే ,కలగా నువ్వు మారకే
అడుగడుగునా....ప్రతి క్షణమునా
ప్రతివేలలోనీ రూపే ..
మరవలేక నిను మరిచానే
మరుక్షనమునే నిను తలచానే
మరవలేని క్షణమే నీవు ,
మరవకుడని ప్రతిమే నీవు,
మాయలాగా మనసేదోచి
నన్ను మనిషినే చేసావే ...
Wednesday, July 14, 2010
Monday, June 28, 2010
చక్కని నేస్తం మన చందమామ !!!!!!
మామ చందమామ
నిన్ను తొలిసారి చూసాను మామ . !!2!!
నా చిన్నప్పుడు అమ్మే నీ గురించి చెప్పెను
నీ చల్లని నీడలో కథలెన్నో నాకు నేర్పెను !!2!!
చంటిపాపనైన నాకు చక్కని నేస్తమని ,
సరదాలు తీర్చే ఆటబోమ్మవని ,
కవులకు కవితవని , పాటకు పల్లవని
చంటి పాప బోసినవ్వు నీవు అని....
!! నా చిన్నప్పుడు !!
భూమికి చుట్టమని , తన చుట్టూ ఉంటావని
సాయంత్రం చల్లని నీడవని.....
అమావాస్య చికటని, అసలే రావుఅని
ఆడుకునే నేస్తం నేడు రాడు అని.
!! నా చిన్నప్పుడు !!
Thursday, June 17, 2010
పుట్టినరోజు
నేను పుట్టిన క్షణాలు అమ్మ పురిటి నొప్పులు
నేను పెరిగిన క్షణాలు మధ్యతరగతి జీవితాలు
చదువుకున్న రోజులు సర్కారు బడిలో తరగతులు
ఆడుకున్న రోజులు మా ఊరి సందులో
10 th class వరకు tension లేని బ్రతుకు .
కాలేజీ చదువు నా జీవితానికి మలుపు
ఆనందపు క్షణాలు,నా ఆత్మీయ భంధువులు
మరవలేని క్షణాలు , చెరపలేని జ్ఞాపకాలు .
నా జీవితపు పుస్తకంలో మరికొన్ని జ్ఞాపకాలు
నింపుటకు వచ్చింది మరో ఆనంద సమయం
అదే నా జన్మదినం ............
మీ శ్రావ్యం
Sunday, June 6, 2010
క్షణికావేశం
కళ్ళకు గంతలు కట్టినవేల
మనసుకు కళ్ళెం తెంచిన వేల
కోరికలు గుర్రాల వేగం చేరగా
మృగపు చాయలే ముసురుకోగా
అడుగులు తడబడి , మాటలు సరి చెడి
మాయే నిను చేరి , మనిషిని చంపేసి
చేసే క్షణకాలపు పొరపాటు
చేసెను మన బ్రతుకును కటిక చీకటి .
మనసుకు కళ్ళెం తెంచిన వేల
కోరికలు గుర్రాల వేగం చేరగా
మృగపు చాయలే ముసురుకోగా
అడుగులు తడబడి , మాటలు సరి చెడి
మాయే నిను చేరి , మనిషిని చంపేసి
చేసే క్షణకాలపు పొరపాటు
చేసెను మన బ్రతుకును కటిక చీకటి .
Sunday, May 30, 2010
నో స్మోకింగ్

పొగాకు పొగ తాగి నీ ప్రాణం పోనివ్వకు
గుప్పుమంటూ త్రాగు పొగ నీ గుండె పిండిచేస్తుంది
నీ పక్క వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది
సిగరెట్టూ పొగ వదిలి వదిలి నీ ప్రాణమే పోతుంది
రక్షించే రక్తమే చీకటి మయం అవుతుంది
అయినవారినందరికి అన్యాయం చేస్తుంది
క్షణకాలపు ఆనందం క్షయలాగా మారుతుంది
కడుపులో కాన్సేరై నిన్నే కాల్చేస్తుంది
అందుకే పొగ త్రాగావద్దు
గుప్పుమంటూ త్రాగు పొగ నీ గుండె పిండిచేస్తుంది
నీ పక్క వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది
సిగరెట్టూ పొగ వదిలి వదిలి నీ ప్రాణమే పోతుంది
రక్షించే రక్తమే చీకటి మయం అవుతుంది
అయినవారినందరికి అన్యాయం చేస్తుంది
క్షణకాలపు ఆనందం క్షయలాగా మారుతుంది
కడుపులో కాన్సేరై నిన్నే కాల్చేస్తుంది
అందుకే పొగ త్రాగావద్దు
Thursday, May 13, 2010
మనోవ్యధ
ఎడారిలో ఎండమావిల ఎదురుగా నిలుచున్న వేల
ఏమని అడగను నేనేమి చెప్పను
నోటికాడ మాటరాక , నిలువ తన నీడ లేక
నింగిలోకి చూసిన నిరసించి పోయిన
తను కంటపడి కంటతడి
ఎదురుపడి ఎధనోప్పి
తెచ్చే మనసులోని జ్ఞాపకాలు
మరుగున పడలేక
మల్లి మల్లి లేచి
మనోవ్యధ పెంచెనే ....
Subscribe to:
Posts (Atom)