అర్ధం కాని పుస్తకం , నా జీవితం.
విషయ సూచిక అసలే లేని ప్రయాణం .
ప్రతి పాటం నేర్పింది ఒక గుణపాటం.
పేజి పేజి తెచ్చింది నాలో మార్పు అనుక్షణం .
పేజి తిప్పితే ఏముంటుందో అన్న భయం ,
ఉన్న పెకిలో ఉండనివ్వని జీవన చక్రం.
బాష ,యాస అక్కరలేని జీవిత గ్రంధం ,
తెరచి చూస్తే కనిపించే ప్రతివాడి గతం .
మొదటి అడుగులో అచ్చులు నేర్చి ,హావ భావాల హల్లులతో ,
సాగించా నే ప్రయాణం, కొనసాగించా నా జీవనయానం.
No comments:
Post a Comment